News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Boomerang Roti: డ్రోన్స్‌లా ఎగురుతున్న రోటీలు - వైరల్ అవుతున్న వీడియో

Boomerang Roti: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తి అత్యంత నైపుణ్యంతో రోటీలు తయారు చేస్తున్నాడు. 

FOLLOW US: 
Share:

Boomerang Roti: ఇది సోషల్ మీడియా యుగం. ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఏ వార్త అయినా సెకన్లలో లక్షలాది మందికి చేరుతోంది. మన ఇంటి పక్కనే జరిగే చిన్న గొడవ తాలూకు వార్త క్షణాల్లో వైరల్ గా మారి తిరిగి మీ ఫోన్ కే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతలా సోషల్ మీడియాను వాడేస్తున్నారు యూజర్లు. అలా కంటెంట్‌ ఉన్నోడి కటౌట్‌ చాలు అన్నట్టు కొన్ని కొన్ని వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తూ ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాయి. ఓ పెద్ద బ్రేకింగ్ న్యూస్ కావొచ్చు, లేదా ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ కావొచ్చు, డ్యాన్స్, సాంగ్, మరేదైనా నైపుణ్యాన్ని ప్రదర్శించే వీడియో కావొచ్చు.. అలా సోషల్ మీడియాలో పెట్టగానే ఇలా లక్షలు, కోట్లాది మంది వీక్షిస్తూ దానిపై వారి స్పందన కూడా తెలియజేస్తున్నారు. పాటలకు డ్యాన్సులు, సినిమా డైలాగ్ లకు ఎక్స్‌ప్రెషన్స్‌ తో కూడిన లిప్ మూమెంట్, ఫ్రాంక్ వీడియోలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టఫ్ గురించి పక్కన పెడితే కొందరు వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ చేసే వీడియాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి అత్యంత నైపుణ్యంతో రోటీలు తయారు చేస్తున్నాడు. అదేంటీ.. రోటీలు తయారు చేసే వీడియో కూడా వైరల్ అవుతోందా అని అనుకోవద్దు. ఎందుకంటే.. ఆ వీడియో చూస్తే అతడెంత నైపుణ్యంతో రోటీలు తయారు చేస్తున్నాడో అర్థం అవుతుంది. సాధారణంగా రుమాల్ రోటీలు గాల్లో ఎగిరేస్తూ తయారు చేయడం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కూడా అలాగే రోటీని గాల్లో ఎగిరేస్తూ తయారు చేశాడు. కానీ అది కాస్త వైరల్ అయింది.

వైరల్ అవుతున్న 18 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఏముందంటే.. ముక్కుకు, మూతికి ట్రాన్స్‌పరెంట్ మాస్క్ ధరించిన వ్యక్తి మొదటి కాస్తంత పిండి తీసుకున్నాడు. దానిని చేతితో వత్తుతూ కొద్దిగా గుండ్రంగా చేశాడు. ఆ వెంటనే దానిని గాలిలో అంతెత్తు ఎగిరేశాడు. అది కాస్త దూరంగా వెళ్లింది. అక్కడ ఉన్న మరో వ్యక్తి దానిని పట్టుకుంటాడేమో అనుకుంటారు చాలా మంది. కానీ అంతెత్తు గాల్లో ఎగిరేసిన ఆ రోటీ తిరిగి తన వద్దకే వచ్చేస్తుంది. బూమరాంగ్ తరహాలో ఆ రోటీ అలా తన వద్దకే రావడం చూసి అక్కడ ఉన్న వాళ్లు అవాక్కవుతారు. మళ్లీ చేతితో నైపుణ్యంగా రోటీని అందుకున్న ఆ వ్యక్తి దానిని మునివేళ్లపై గిరగిరా తిప్పుతూ, రకరకాల విన్యాసాలు చేస్తూ భలే ఆకట్టుకున్నాడు. కుడిచేతి చూపుడు వేలిపై ఉంచి బాస్కెట్‌బాల్‌ ను తిప్పినట్లు గిరగిరా తిప్పాడు. అతడి నైపుణ్యం చూసిన వాళ్లు చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. 

వైరల్ అవుతున్న 18 సెకన్ల ఈ వీడియోను యాప్ సర్కిల్ సీఈవో, రచయిత అయిన టెన్సు యెగెన్ అనే వ్యక్తి తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశాడు. జూన్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు బి ప్రౌడ్ ఆఫ్ యూ అని క్యాప్షన్ ఇచ్చి పోస్టు చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఇప్పటి వరకు 2.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి టాలెంట్ ను ప్రశంసిస్తూ యూజర్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.

Published at : 28 Jun 2023 11:56 AM (IST) Tags: Viral News Viral Video Latest Viral Video Boomerang Roti Man Excellent Skills

ఇవి కూడా చూడండి

Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్

Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్

Viral Video: కార్‌పై క్రాకర్స్‌ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్

Viral Video: కార్‌పై క్రాకర్స్‌ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్

Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్​ కావాలా? ఇండియన్స్​కి క్రేజీ ఆఫర్​ ఇచ్చిన థాయ్​లాండ్

Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్​ కావాలా? ఇండియన్స్​కి క్రేజీ ఆఫర్​ ఇచ్చిన థాయ్​లాండ్

యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో

యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో

ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!

ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!

టాప్ స్టోరీస్

Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !

Lets Vote :  ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు  బాధ్యత కూడా !

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం