Viral Video: కాస్త చూసుకోవాలి కదా బాసూ! - కారు పార్క్ చేస్తూ రివర్స్ గేర్, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డ వాహనం, వైరల్ వీడియో
Pune News: కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా రివర్స్ గేర్ వేయడంతో ఆ వాహనం అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తు నుంచి కింద పడిపోయింది. పుణేలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.

Car Fell From First Floor While Reverse Gare In Pune: ఓ డ్రైవర్ కారు పార్కింగ్ చేస్తూ నియంత్రణ కోల్పోయాడు. ఒక్కసారిగా రివర్స్ గేర్ వేయడంతో కారు పార్కింగ్ కాంప్లెక్స్ గోడను ఢీకొని ఒకటో అంతస్తు నుంచి కింద పడిపోయింది. మహారాష్ట్రలోని పూణేలో (Pune) ఈ ఘటన తాజాగా జరగ్గా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుణేలోని విమన్ నగర్‌లో శుభ గేట్ వే అపార్ట్‌మెంట్‌లో వాహనాల పార్కింగ్ కోసం మొదటి అంతస్తులో స్థలం ఉంది. ఆదివారం ఉదయం కారును పార్క్ చేసేందుకు డ్రైవర్ యత్నించాడు. అయితే, నియంత్రణ కోల్పోయి రివర్స్ గేర్ వేయడంతో కారు ప్రమాదానికి గురైంది.
Don't try to drive/park like James Bond.
— Ashok Bijalwan अशोक बिजल्वाण 🇮🇳 (@AshTheWiz) January 21, 2025
Incident at Shubh Gateway Apartment, Viman Nagar in Pune. pic.twitter.com/v9NOmP3csm
పార్కింగ్ ప్లేస్ గోడను బద్దలు కొట్టుకుంటూ మొదటి అంతస్తు నుంచి కింద పడిపోయింది. అయితే, ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. కారులో నుంచి డ్రైవర్‌ను బయటకు తీశారు. ఈ ప్రాంతంలోని సీసీ కెమెరాలో ఈ వీడియో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. గోడ నాణ్యతపై కొందరు ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొందరు కారు పడిన చోట ఎవరైనా ఉంటే ఏంటి పరిస్థితి.? అంటూ కామెంట్స్ చేశారు.
Also Read: Maha Kumbhmela 2025: అంతరిక్షం నుంచి మహాకుంభమేళా - ఇస్రో విడుదల చేసిన అద్భుత చిత్రాలు చూశారా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

