Sharmila On KTR: ‘కాలు విరిగితే ఇంట్లో కూర్చుంటాడా? ఓటీటీలో షోలు చూస్తారా? సిగ్గుందా మనుషులేనా?’ - షర్మిల
YS Sharmila ట్విటర్ లో స్పందిస్తూ ‘‘త్వరగా కోలుకోండి కేటీఆర్. మీరు ఓటీటీలో చూడదగిన సినిమాలు.. కుట్ర సిద్ధాంతం: ది క్లౌడ్ బరస్ట్, నీటమునిగిన ఇళ్లు, పంప్ హౌజ్‌లు’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Minister KTR పై YSR Telangana Party అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి కాలు విరగడం వల్ల ఆయనకు వైద్యులు మూడు వారాల పాటు విశ్రాంతి సూచించిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి ఓటీటీలో ఏం సినిమాలు చూడాలో చెప్పాలంటూ ట్వీట్ చేశారు. దీనిపై షర్మిల తనదైన శైలిలో స్పందిస్తూ సమాధానం ఇచ్చారు. ఈనెల 23న షర్మిల ట్విటర్ లో స్పందిస్తూ ‘‘త్వరగా కోలుకోండి కేటీఆర్. మీరు ఓటీటీలో చూడదగిన సినిమాలు.. కుట్ర సిద్ధాంతం: ది క్లౌడ్ బరస్ట్, నీటమునిగిన ఇళ్లు, పంప్ హౌజ్‌లు’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
అయితే, సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించిన వైఎస్ షర్మిలను కేటీఆర్ ఓటీటీ ట్వీట్ గురించి స్పందించాలని విలేకరులు ప్రశ్నించారు. దీంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘కేటీఆర్ ట్వీట్ గురించి మీకేం అనిపించిందో చెప్పండి. నాకైతే మండింది. కాలు విరిగి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే రిమోట్ గా పని చేయలేరా? కరోనా సమయంలో ఎంత మంది రిమోట్ గా పని చేశారు? ఓటీటీలో ఏం సినిమాలు బాగుంటాయని అడిగితే మేం వెటకారంగా స్పందించాం. దానికి చిన్న దొరగారికి చాలా కోపం వచ్చి నాపై వ్యక్తిగతంగా చాలా విరుచుకుపడ్డారు. దమ్ముంటే సబ్జెక్ట్ మాట్లాడాలి. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కాలేదో చెప్పండి. ముఖ్యమంత్రి తర్వాతి స్థానంలో ఉండి.. కాలు విరిగితే ఇంట్లో కూర్చుంటాడట! సినిమాలు, షోలు చూస్తాడట! వరదలు వచ్చి రైతులు నష్టపోయారు. ఇళ్లు కోల్పోయారు. వాళ్లకి సాయం చేసింది లేదు. పరామర్శించింది లేదు. ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారా? ఇవేం మాట్లాడకుండా, పెళ్లై, బిడ్డలున్న నాపై దూషణలు చేస్తారా? సిగ్గుందా? మనుషులేనా?’’ అంటూ ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
వరదలొచ్చి రైతులు పంట నష్టపోతే, పేదల ఇండ్లు కూలిపోతే, లక్షల మంది బతుకులు రోడ్డున పడితే.. చిన్న దొర ఓటీటీల్లో షోలు చూస్తాడట. రిమోట్‌గా పనిచేయలేడా? టెలీ, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించలేడా? అధికారులు 24గం. డ్యూటీ చేయాలి.రూ.లక్షల్లో జీతం తీసుకునే చిన్నదొర సినిమాలు చూస్తాడా? pic.twitter.com/hqeYR981gR
— YS Sharmila (@realyssharmila) July 25, 2022
ఆ తర్వాత ట్వీట్ లో ‘‘వరదలొచ్చి రైతులు పంట నష్టపోతే, పేదల ఇండ్లు కూలిపోతే, లక్షల మంది బతుకులు రోడ్డున పడితే.. చిన్న దొర ఓటీటీల్లో షోలు చూస్తాడట. రిమోట్ గా పనిచేయలేడా? టెలీ, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించలేడా? అధికారులు 24 గంటల డ్యూటీ చేయాలి. రూ.లక్షల్లో జీతం తీసుకునే చిన్నదొర సినిమాలు చూస్తాడా?’’ అంటూ షర్మిల నిలదీశారు.
‘‘రెండేండ్లకే కాళేశ్వరం మునిగితే మెగా కృష్ణారెడ్డిపై చర్యలేవి? 80 శాతం ప్రాజెక్టులు ‘మెగా’కే ఎందుకు ఇస్తున్నరు? తెలంగాణ తెచ్చుకుంది ‘మెగా’ కోసమా? ఉద్యమంలో ఆంధ్రా కాంట్రాక్టర్లు వద్దని, ఇప్పుడెందుకు ఆంధ్రా కాంట్రాక్టర్ కు తెలంగాణ సొమ్మును కట్టబెడుతున్నరు? KCR, మెగా ఇద్దరూ తోడు దొంగలే. మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ ఇద్దరూ దోచుకునే దోస్తులే. అందుకే ఏ ప్రాజెక్టు చేపట్టినా ‘మెగా’కే ఇస్తుండు.ఇన్నాళ్లు ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఏనాడు దీనిపై ప్రశ్నించలే. రేవంత్ రెడ్డికి, బండి సంజయ్ కి తమ వంతు వాటా దక్కుతోంది కాబట్టే గొంతెత్తడం లేదు.’’ అని మరో ట్వీట్ చేశారు.