(Source: ECI/ABP News/ABP Majha)
Sharmila Letter to PM Modi: ప్రధాని మోదీకి షర్మిల లేఖ, కాళేశ్వరంలో అవినీతిపై జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్!
Kaleshwaram Project: ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టులో వైఫ్యలాలు, అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
PM Modi Visits Hyderabad: తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న అంశాలలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ఒకటి. ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టులో వైఫల్యాలు బయటకు రావడంతో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని కాంగ్రెస్, బీజేపీ అంటున్నాయి. అయితే ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాళేశ్వరం ప్రాజెక్టులో వైఫ్యలాలు, అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధాని మోదీ హైదరాబాద్ లో బీసీ ఆత్మగౌరవ సభకు వచ్చిన సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అంశంపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
‘కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, అవినీతిపై జోక్యం చేసుకుని వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని గట్టిగా విజ్ఞప్తి చేశాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అవినీతి, అక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఆరోపణలతో అంతా బహిర్గతం అయ్యాయి. ప్రాజెక్ట్ వైఫల్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ (Telangana) మొత్తం ఆందోళన చేస్తున్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలలకు ఆదేశించకుండా మౌనముద్ర ధరించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. లక్షల కోట్ల రూపాయాల ప్రజాధనం వృథా కావడంపై తెలంగాణ సమాజం యావత్తు ఆవేదన చెందుతోంది.
రాష్ట్ర ప్రజాధనం 1.20 లక్షల కోట్ల రూపాయలు మోసం చేసి, తన జేబులు నింపుకోవడానికి, కుటుంబ సంపదను సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తుప్పుపట్టించారు. ఈ ప్రాజెక్టును ఎందుకు పనికిరాకుండా చేయడం, ఈ జాతీయ విపత్తుపై కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలకు, విచారణకు ఆదేశించాలి. చాలా కాలంగా ప్రాజెక్ట్ సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్నాము. తాను కేవలం పార్టీకి మాత్రమే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా మారి బాధను వివరిస్తున్నానని’ ప్రధాని మోదీకి రాసిన లేఖలో వైఎస్ షర్మిల ప్రస్తావించారు.
Made a strong appeal to Shri@narendramodi
ji seeking his intervention and direct immediate investigation and action into the Kaleshwaram project’s failures and corruption. I have also expressed displeasure about the inaction on part of the BJP govt, despite so many exposures and allegations, and entire Telangana voicing concern against the project’s failures. It is our earnest appeal to him to act at least now and look into this national disaster where KCR has duped the country of Rs 1.20 lakh crore and created a white elephant to fill his pockets and swell his family’s net worth. We have been waging a relentless battle on the project issues for long and this representation is not just by YSRTP but is the voice and pain of the 4-crore Telangana people.