Hyderabad News: దంత చికిత్స కోసం వెళ్లిన యువకుడి అనుమానాస్పద మృతి - వైద్యుల నిర్లక్ష్యం వల్లేనని కుటుంబ సభ్యుల ఆరోపణ
Young Man Suspicious Death: దంత వైద్యం కోసం వచ్చిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Young Man Suspicious Death in Hyderabad Dental Hospital: దంత చికిత్స కోసం వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ (Hyderabad)లో జరిగింది. వింజం లక్ష్మీనారాయణ (28) అనే యువకుడు జూబ్లీహిల్స్ (Jubileehills) లోని రోడ్ నెంబర్ 37లో ఓ డెంటల్ క్లినిక్ లో దంత చికిత్స కోసం వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే లక్ష్మీ నారాయణ మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటి వైద్యం కోసం వస్తే ఎక్కువ మత్తు మందు ఇచ్చారని ఆరోపించారు. అనంతరం యువకుడు స్పృహ కోల్పోయాడని.. దీంతో వెంటనే అతన్ని అపోలో ఆస్పత్రికి తరలించారని చెప్పారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మార్గ మధ్యంలోనే చనిపోయినట్లు నిర్ధారించారని వెల్లడించారు. తమ బిడ్డ మృతికి కారణమైన వారిని శిక్షించాలని మృతుడి తండ్రి డిమాండ్ చేశారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Kakinada Accident: కాకినాడ జిల్లాలో ప్రమాదం - డ్రైవర్ కు అస్వస్థతతో తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా