అన్వేషించండి

Year Ender Telangana Top 10 Devolepment Works : తెలంగాణకు మరపురాని ఏడాది 2022 - రూపురేఖలు మారేలా అభివృద్ది !

తెలంగాణకు 2022 మరపురాని ఏడాదిగా నిలిచింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు పూర్తవడమో.. చివరి దశకు రావడమో జరిగాయి. తెలంగాణలో ఈ ఏడాది జరిగిన టాప్ టెన్ అభివృద్ది పనులు ఇవిగో

 
Year Ender Telangana Top 10 Devolepment Works : కొత్త ఏడాది వస్తోందంటే.. గత ఏడాది ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకోవడం.. తర్వాత ముందడుగు వేయడానికి ఎంతో ముఖ్యం. ప్రభుత్వాలు ఏం  చేశాయనేది ప్రజలు చూసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాదిలో అత్యంత కీలకమైన ... అభివృద్ధి పనులనుప్రారంభించింది. అవి తెలంగాణ రూపు రేఖల్ని మార్చేవే. వాటిలో టాప్ టెన్ అభివృద్ధి పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

తెలంగాణ కొత్త సచివాలయం 

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.  అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంంది.  ఈ భవనం ప్రస్తుతం ఫినిషింగ్ దశలో ఉంది. హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండతోపాటు కుతుబ్‌షాహీ టూంబ్స్, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు భవనం గుర్తుకొస్తాయి. వీటన్నింటిలోనూ డోమ్‌లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కుతుబ్‌షాహీలు, అసఫ్‌ జాహీల జమానాలోని కట్టడాల్లో ఎక్కువగా ఉంటాయి. ఆధునిక కాలంలో ఇలాంటి నిర్మాణాలు అరుదు. అయితే కాకతీయ–పర్షియా నిర్మాణ శైలులను మేళవించి డిజైన్‌ చేసిన కొత్త సచివాలయ భవనంపై గుమ్మటాలు కనువిందు చేయనున్నాయి. ఈ భవన నిర్మాణాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సంక్రాంతి నుంచి ఈ భవనంలో పాలన ప్రారంభిస్తారు. 

అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు !

టిఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన అనంతరం పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉం డేలా అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. సమీకృత కలెక్టరేట్‌ల నిర్మాణంతో జిల్లా కార్యాలయాలన్నీ ఒకేచోట ఉంటాయని, దీనివల్ల అధికారులందరూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. నిర్మించిన కలెక్టరేట్లను కేసీఆర్ వరుసగా ప్రారంభిస్తున్నారు. 
   
హైదరాబాద్ సిటీలో ఫ్లైఓవర్లు 

సిగ్నల్ ఫ్రీ.. ట్రాఫిక్ ఫ్రీ.. ఇదే లక్ష్యంతో మహానగరంలో వీలైన ప్రతిచోట ఫ్లై ఓవర్లు నిర్మాణం చేస్తున్నారు. పాతబస్తీ, కొత్తబస్తీ తేడా లేదు.. ట్రాఫిక్ ఫికర్ ఉందా.. ఫ్లైఓవర్ కట్టేయ్ అంటున్నారు అధికారులు. సిటీకి నలుదిక్కుల నుంచి నడిమధ్యకు రావాలన్నా.. ఓ కొన నుంచి ఈ కొనకు వెళ్లాలన్న ఓ పెద్ద ప్రయాస. అది ఒకప్పుడు. కానీ ఇప్పడు సిగ్నల్ లు కాదు.. సింగిల్ రైడ్ తో ఫ్లైఓవర్లమీదుగా ఆగేదేలే అన్నట్లు వెహికిల్స్ దూసుకెళ్తున్నాయి. ఎస్.ఆర్.డి.పి ద్వారా నగరంలో నలువైపులా జిహెచ్ఎంసి ద్వారా చేపట్టిన  41 పనులలో దీంతో 30 పనులు పూర్తి అయ్యాయి. మిగతా 11 పనులు వివిధ అభివృద్ధి దశలో కలవు. దీంతో ఇప్పటి వరకు 15 ఫ్లై ఓవర్లు పూర్తయ్యాయి. ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 
 
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం 

శంలోనే తొలిసారి వినూత్న కట్టడం.. పోలీస్ శాఖలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నత అధికారులంతా ఒకే చోట నుండి రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ మ్యానిటరింగ్, కమాండ్ కంట్రోల్ చేసేందుకు వీలుగా అతిపెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. విదేశీ టెక్నాలజీని వాడుకుంటూ అధునాతన సాంకేతిక పరిజ్జానంతో హైదరబాద్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నిర్మించిన తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.  ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలను నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. 

8 కొత్త మెడకల్ కాలేజీలు ప్రారంభం  

ఈ ఒక్క  సంవత్సరంలో ఒకే రోజు  8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభమయ్యాయి.  వీటికి ఆయా జిల్లాల ఆసుపత్రులను అనుసంధానం చేశారు. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో 1,200 మెడికల్ సీట్లను కేటాయించారు. వీటితోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 85 శాతం బీ కేటగిరీ మెడికల్ సీట్లను సైతం విద్యార్థులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అదనంగా 1,068 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.  జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్‌లో మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. 

టీ హబ్ 2 ప్రారంభోత్సవం

దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ 2 ఈ ఏడాదే ప్రారంభమయింది.  మాదాపూర్లో అత్యున్నత ప్రమాణాలతో, అధునాతన సౌకర్యాలతో   ఈ క్యాంపస్ నిర్మించారు.  వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ అయిన టీ హబ్ 2ను ప్రభుత్వం రూ.400 కోట్ల పెట్టుబడితో 3ఎకరాల విస్తీర్ణంలో నిర్మించింది. ఇందులో ఒకేసారి 2 వేలకు పైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశముంది. శాండ్‌విచ్ ఆకారంలో కనిపిస్తూ.. అట్రాక్ట్‌ చేసేలా రూపుదిద్దుకున్న ఈ నిర్మాణంలో.. ప్రతీది ఓ అద్భుతంగా కనిపిస్తుంది. 400 కోట్ల రూపాయల ఖర్చుతో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన టీ–హబ్  రెండో దశలో ఏకకాలంలో 4 వేల స్టార్టప్ లకు అవసరమైన వసతి కల్పించవచ్చు.

మల్లన్న సాగర్ జాతికి అంకితం 

కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన మల్లన్న సాగర్ ను ఈ ఏడాదే ప్రారంభించారు.   మొత్తం ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న, అత్యంత ఎత్తున ఉన్న జలాశయం ఇదే. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ మహా జలాశయానికి 5 ఓటీ స్లూయిస్‌లు (తూములు) ఉన్నాయి. ఆ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు, మిషన్‌ భగీరథకు నీటిని తరలిస్తారు.  గ్రావిటీపైనే 2.27 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. 

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌తో దేశానికి కీర్తి

నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్‌జెన్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ను తెలంగాణకు గుండెకాయ లాంటిదని చెప్పవచ్చు. ఇక్కడ సింగరేణి బొగ్గుతోపాటు.. అవసరం ఏర్పడితే కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ద్వారా విదేశీ బొగ్గును కూడా త్వరితంగా దిగుమతి చేసుకొనేలా రైల్వే ట్రాక్‌ ఉన్నాయి. భవిష్యత్తులో అవసరం ఏర్పడితే మరో 4,000 మెగావాట్ల ప్లాంటును కూడా నిర్మించడానికి వీలుగా అన్ని అనుకూలతలు ఉన్నాయి. దీనికి అదనగా అక్కడే మరో 5 నుంచి 6 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ను రూ.29,965 కోట్లతో చేపట్టారు. ఇప్పటి వరకూ   రూ.18,443.50 కోట్లు ఖర్చు పెట్టారు. ప్లాంట్ నిర్మాణంలో ఈ ఏడాది కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. 

యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవం 

12 వందల 80 కోట్ల  నిధులతో యాదాద్రిని పునర్ నిర్మించింది ప్రభుత్వం. 2015లో పునర్ నిర్మాణాన్ని మొదలు పెట్టగా ఇటీవలే నిర్మాణం పూర్తైంది. ప్రధానాలయం పునర్ నిర్మాణంతో 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తుల దర్శనాలు అనుమతిచ్చారు,  అబ్బురపడే రీతిలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఓ రకంగా చెప్పాలంటే గుడి కాదు ఏకంగా గుట్టనే మారిపోయింది. యాదాద్రి ఆలయ నిర్మాణంలో కాకతీయ, చోళ, చాళుక్య, పల్లవ.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణ శైలులను వినియోగించారు. వైష్ణవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆళ్వార్లు ఇక్కడ రాతి స్తంభాల రూపంలో ముఖ మండపంలో కొలువుదీరారు. 12 మంది ఆళ్వార్లు 11 అడుగుల ఎత్తుతో 38 అడుగుల ఎత్తున్న ముఖ మండపానికి ఆధారభూతంగా నిలిచారు. మరెక్కడా లేనట్టుగా 1,700 అడుగుల పొడవునా.. దాదాపు 80 నుంచి 100 అడుగుల ఎత్తుతో ప్రాకారాలను నిర్మించారు.

మెట్రో రెండో దశకు శంకుస్థాపన 

పూర్తిగా తెలంగాణ  ప్రభుత్వ నిధులతోనే ఐటీ హబ్‌ మైండ్‌ స్పేస్‌ రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,250 కోట్ల అంచనాతో 31 కి.మీ దూరం మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. మైండ్‌స్పేస్‌ నుంచి గచ్చిబౌలి, నానక్‌రాంగూడ జంక్షన్‌ల నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు కొత్తగా మెట్రో రైలు సౌకర్యం రానుంది. ప్రయాణికులకు స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ స్థాయి అత్యాధునిక సదుపాయాలతో హెచ్‌ఏఎంఎల్‌ ఎయిర్‌పోర్టు మెట్రోను నిర్మించనుంది. - 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget