SAWiT.AI:హైదరాబాద్‌లో ప్రపంచ అతిపెద్ద మహిళా AI హ్యాకథాన్
కేవలం మహిళలు మాత్రమే పాల్గొన్న ప్రపంచంలోనే అతిపెద్ద Gen-AI హ్యాకథాన్ హైదరాబాద్‌లో జరిగింది. దాదాపు ౩లక్షల 93వేల మంది ఇందులో పాల్గొన్నారు.

SAWiT Hackathon: డిజిటల్ ఇండియా 2.0 వైపు అడుగులు వేస్తున్న ఇండియా.. ఇందులో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయడంలో ఇంకా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ.. SAWiT (South Asian Women in Tech) ఓ భారీ Hackathon ను నిర్వహించింది. హైదరాబాద్ లోని T-Hub వేదికగా కేవలం మహిళలతోనే జరిగిన ఈ భారీ హ్యాకథాన్ ప్రాంతీయ విభిన్నత, లింగ సమానత (gender inclusion) అనేవి అనేక సమస్యలకు పరిష్కారం చూపగలుగుతుందని నిరూపించింది.
ప్రంపంచంలోని అతిపెద్ద మహిళా హ్యాకథాన్
దేశవ్యాప్తంగా వివిధ దశల్లో జరిగిన ఈ హ్యాకథాన్‌లో 3,93,071 మంది పాల్గొన్నారు. ఫైనల్ రౌండ్ హైదరాబాద్‌లోని T-hubలో జరిగింది. మొత్తం మహిళలతో జరిగిన ఈ ఈవెంట్ జనరేటివ్ AIలో ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా ఈవెంట్. ఈ ల్యాండ్‌మార్క్ ఈవెంట్ ముఖ్యంగా రెండు అంశాలపై దృష్టి పెట్టింది. మహిళలను టెక్నాలజీలో ప్రోత్సహించడంతో పాటు.. టెక్ ఇన్నోవేషన్‌లో ఉన్న లాంగ్వేజ్ అవరోధాలను తొలగించడంపైనే ఈ హ్యాకథాన్ దృష్టి సారించింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఫైనల్‌కు వచ్చిన 25టీమ్‌లులు వారి వారి స్థానిక భాషల్లోనే తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. మహిళలను వారి సొంత భాషలోనే టెక్ ప్రాజెక్టులను చేసేలా ప్రోత్సహించడం ద్వారా SAWiT ఇప్పటి వరకూ సరైన ప్రాతిధ్యం దక్కని టాలెంట్ పూల్‌కు ప్రోత్సాహం అందించింది. అంతే కాదు భారత డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూవల్ ఎకోసిస్టమ్‌లోకి మహిళలు మరింతగా వెళ్లే అవకాశాలను బలపరిచింది.
ఇదే అసలైన డిజిటల్ విప్లవం
మహిళలను తమ సొంత భాషల్లో టెక్ ఇన్నోవేషన్ లో ప్రోత్సహించడం అన్నది డిజిటల్ ఇంటిగ్రేషన్‌లో అతి పెద్ద ముందడుగు. ఇదే అసలైన డిజిటల్ విప్లవం అని సెర్ప్ CEO దివ్య దేవరాజన్ అన్నారు. “SAWiT చేపట్టిన ఈ కార్యక్రమం కొత్త అవకాశాలకు ప్రోత్సాహం ఇస్తుంది. భారతీయ టెక్ విప్లవం ప్రతీ గొంతూ వినిపించడానికి దోహదం చేస్తుంది” అన్నారు.
మనం క్షేత్రస్థాయి ఆవిష్కరణలకు అవకాశం కల్పించగలిగితే.. భారత భవిష్యత్‌ను నిర్దేశించగలిగే అనేక మార్గాలను అవి చూపించగలుగుతాయని ఈ హ్యాకథాన్ ప్రూవ్ చేసిందని Subid Chakraborty, Head of Sales – Kalido అన్నారు. ఇది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు.. “విభిన్న రంగాలు, ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు టెక్నాలజీలో తమ సత్తా చూపడానికి కల్పించేటువంటి సాధికారిత. ఇంత మంది ఇన్నోవేటర్స్ అనేక సమస్యలకు ప్రభావవంతమైన అప్లికేషన్లు తయారు చేయడం చూస్తుంటే గర్వంగా ఉంది.”
"ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రత్యేకంగా ఉంటడం భారత్ అసలైన బలం. భారతీయ భాషల్లో రూపొందిన స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం అంటే మన టెక్ విస్తృతిని బాగా పెంచడం, అంతే కాదు అద్భుతమైన మార్పుకోసం మహిళలకు సాధికారిత కల్పించడం. మహిళలన్ని టెక్నాలజీ దిశగా ప్రోత్సహించడం అనేది కేవలం వారికి అందులో అవకాశం కల్పించడం మాత్రమే కాదు.. వారికి మాత్రమే ప్రత్యేక మైన దృక్కోణాలకు అవకాశం కల్పించడం ప్రాంతీయ బలాన్ని చాటడం.. SAWiT కచ్చితంగా అదే చేస్తోంది."Priyanka Kamath, Founder of 100 GIGA
మహిళల భాగస్వామ్యం ఇంకా పెరగాలి.
2022 లెక్కల ప్రకారం మన భారతీయ వర్క్ ఫోర్స్‌లో మహిళలు కేవలం 22శాతం మంది మాత్రమే. 61శాతం మంది మహిళల భాగస్వామ్యం ఉన్న చైనాతో పోలిస్తే.. ఇది చాలా తక్కువ. అందుకే SAWiT.AI లాంటి సంస్థలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళల భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తున్నాయి. మహిళల భాగస్వామ్యం ఓ 1౦% పెంచగలిగితే చాలు.. ఇండియా GDP 550 బిలియన్ డాలర్లు పెరుగుతుందని McKinsey అంచనా వేసింది. Generative AI సంబంధిత సంస్థల ద్వారా SAWiT’s ఇప్పటికే 4 లక్షల మంది మహిళలకు శిక్షణ ఇచ్చి… భారతీయ ఫ్యూచర్ టెక్నాలజీ ఇన్నోవేషన్‌లో వారిని భాగస్వాములను చేసింది. దక్షిణాసియాలో ఉన్న ప్రాంతీయ లింగ అసమానతల వల్ల ఇప్పటికీ టెక్ ఇండస్టీలో మహిళల భాగస్వామ్యం ఇక్కడ ౩0శాతం లోపే ఉంది.
SAWiT ఏం చేస్తుందంటే:
SAWiT (South Asian Women in Tech) అనేది దక్షిణాసియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మహిళా టెక్నాలజిస్టులు, ఆవిష్కర్తులు, ఎంటర్‌ప్రెన్యూర్ల కమ్యునిటీ. దాదాపు 80వేల మందికి పైగా సభ్యులున్నారు. అన్ని ప్రాంతాలు, భాషల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళల్లో టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్న మహిళలను గుర్తించడం.. వారి ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందివ్వడం SAWiT చేస్తుంది. వీళ్లకు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు, స్టార్టప్‌లతో సంబంధాలు ఉన్నాయి. మహిళలకు ఉన్న అవకాశాలను గుర్తించి వారిని టెక్నాలజీ రివల్యూషన్‌లో భాగస్వాములను చేయడం వీరి ముఖ్యమైన లక్ష్యం.





















