X

Saddula Batukamma: బుధవారమా..? గురువారమా ? సద్దుల బతుకమ్మ తేదీపై గందరగోళం !

సద్దుల బతుకమ్మ తేదీపై తెలంగాణలో గందరగోళం ఏర్పడింది. కొంత మంది బుధవారం.. మరికొంత మంది గురువారం చేసుకోవాలని చెబుతున్నారు.

FOLLOW US: 

తెలంగాణలో ఎక్కడ చూసినా బతుకమ్మ సందడి కనిపిస్తోంది.  ఈ వేడకులు సద్దుల బతుకమ్మను నిర్వహించడంతో పూర్తవుతాయి. కానీ ఈ సారి సద్దుల బతుకమ్మ ఎప్పుడు నిర్వహించుకోవాలన్న సందిగ్ధత నెలకొంది. 8వ రోజున జరుపుకోవాలా... లేదా 9వ రోజున సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవాలా అన్నది అయోమయంగా మారింది. ఏటా ఎంగిలి పువ్వు బతుకుమ్మతో మొదలై.. 9వ రోజు సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. ఈసారి రెండు తిథులు ఒకే రోజు  వస్తుండడంతో.. 8వ రోజు అష్టమి వస్తోంది. ఇదే ఇప్పుడు సద్దుల బతుకమ్మ ఒకరోజు ముందే జరుపుకోవాలా.. లేదా అన్న టెన్షన్ భక్తుల్లో కనిపిస్తోంది. 

Also Read : రూ.5 కోట్ల కరెన్సీ నోట్లతో కన్యకా పరమేశ్వరి అలంకరణ.. రికార్డు బ్రేక్ చేసిన నెల్లూరోళ్లు..
తెలంగాణ ఏర్పాటు తరువాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. బుధవారం నాడు అంటే 13వ తేదీనే సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని వేదపండితులు సూచిస్తున్నారు. కానీ ఆరో తేదీన ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకలు.. 14వ తేదీ గురువారం రోజులో తొమ్మిది రాత్రులు ముగియనున్నాయి. అయితే, 13వ తేదీనే దుర్గాష్టమి కావడతో కొంత మంది ఒక రోజు ముందుగానే సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని సూచించడంతోనే అయోమయం నెలకొంది. 

అయితే కొంత మంది పండితులు మాత్రం గురువారమే సద్దుల బతుకమ్మ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ధర్మశాస్త్రానుసారంగా  14వ తేదీన నిర్వహించుకోవాలని చెబుతున్నారు.
Saddula Batukamma:  బుధవారమా..? గురువారమా ? సద్దుల బతుకమ్మ తేదీపై గందరగోళం !

Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...

కొంత మంది బుధవారం.. మరికొంత మంది గురువారం అని చెబుతూండటంతో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లపై అధికారుల్లోనూ అయోమయం నెలకొంది. తెలంగాణ విద్వత్సభ ఈ అంశంపై వివరణ ఇచ్చింది. దుర్గాష్టమి రోజే సద్దుల బతుకమ్మ అని స్పష్టం చేసింది. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆచారాల ప్రకారం నిర్వహించుకోవాలని సూచించింది.
Saddula Batukamma:  బుధవారమా..? గురువారమా ? సద్దుల బతుకమ్మ తేదీపై గందరగోళం !

Also Read : 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...

ఈ గందరగోళం నడుమ వేడుకల నిర్వహణ ఎప్పుడనే దానిపై అధికారిక ప్రకటన విడుదల చేయాలని మహిళలు కోరుతున్నారు.  ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసినా వివాదం పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: telangana Batukamma saddula batukamma batukamma controvers

సంబంధిత కథనాలు

Breaking News Live Updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Breaking News Live Updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Huzurabad by poll: ఈటల గెలిచినా మంత్రి అయ్యేది లేదు... ధరలు పెంచిన బీజేపీని ఎందుకు గెలిపించాలి.... మంత్రి హరీశ్ రావు కామెంట్స్

Huzurabad by poll: ఈటల గెలిచినా మంత్రి అయ్యేది లేదు... ధరలు పెంచిన బీజేపీని ఎందుకు గెలిపించాలి.... మంత్రి హరీశ్ రావు కామెంట్స్

Telangana Govt: వ్యాక్సినేషన్ అవ్వకపోతే రేషన్, పింఛన్ కట్ వార్తలన్నీ ఫేక్.. స్పష్టత ఇచ్చిన డీహెచ్

Telangana Govt: వ్యాక్సినేషన్ అవ్వకపోతే రేషన్, పింఛన్ కట్ వార్తలన్నీ ఫేక్.. స్పష్టత ఇచ్చిన డీహెచ్

Warangal: విస్తరిస్తున్న ఆంత్రాక్స్ వ్యాధి.. వరుసగా గొర్రెలు మృతి, ఆందోళనలో ప్రజలు

Warangal: విస్తరిస్తున్న ఆంత్రాక్స్ వ్యాధి.. వరుసగా గొర్రెలు మృతి, ఆందోళనలో ప్రజలు

TRS Harish Kavita : ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?

TRS Harish Kavita :  ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ