By: ABP Desam | Updated at : 25 May 2023 07:00 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
వేసవి తాపంతో అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. దేశంలో హీట్ వేవ్ ముగిసిందని, ఇక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ వెల్లడించింది. అతి కొద్ది ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది.
ఉత్తర - దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య ప్రదేశ్ నుండి విదర్భ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో బుధవారం (మే 24) తెలిపారు. అంతేకాక, ఈరోజు క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని చెప్పారు. దీంతో ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.
రాగల 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 41 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ రోజు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమీ) తో కూడిన వర్షములు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
నేడు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 4 నుంచి 08 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 75 శాతంగా నమోదైంది.
ఏపీలో ఈ మండలాల్లో వడగాల్పులకు అవకాశం
రేపు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు, గుంటూరు జిల్లా గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని,తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు, పల్నాడు జిల్లా అమరావతి, అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.
బుధవారం వైయస్సార్ జిల్లాలో 3 మండలాలు, అనకాపల్లి, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్క మండలంలో వడగాల్పులు వీచాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 44.8 డిగ్రీలు, పల్నాడు జిల్లా మాచర్లలో 44.7 డిగ్రీలు, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 44.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి’’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
Governor Thamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్
TSPSC Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!
Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!
Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?
Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల
Botsa Satyanarayana: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి