News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Weather Latest Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్ తక్కువే: ఐఎండీ

రాగల మూడు రోజులు  తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు  వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

FOLLOW US: 
Share:

‘‘నిన్నటి అల్పపీడనం ఈ రోజు బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించింది. నిన్న సుమారుగా 15°N అక్షాంశం వెంబడి  ఉన్న తూర్పు- పశ్చిమ షియర్ జోన్ (గాలి విచ్ఛిన్నతి) ఈరోజు బలహీన పడింది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast): 
రాగల మూడు రోజులు  తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు  వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని  జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. 

హైదరాబాద్‌లో వాతావరణం

హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 83 శాతంగా నమోదైంది.

ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల  కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా  రెండు  చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా  రెండు  చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ 
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక   చోట్ల  కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా  రెండు  చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా  రెండు  చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ
తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని  చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా  రెండు  చోట్ల సంభవించే అవకాశముంది.

Published at : 01 Oct 2023 07:09 AM (IST) Tags: Weather Updates Weather in Hyderabad Rains In Telangana Rain In Hyderabad Andhrapradesh Rains

ఇవి కూడా చూడండి

Telangana Assembly Election 2023: 1 గంటకు 36.68 % పోలింగ్  - అత్యధికంగా మెదక్ - అతి తక్కువ హైదరాబాద్!

Telangana Assembly Election 2023: 1 గంటకు 36.68 % పోలింగ్ - అత్యధికంగా మెదక్ - అతి తక్కువ హైదరాబాద్!

Telangana Polling 2023 LIVE Updates: ఒంటిగంట వరకూ 36.68 శాతం పోలింగ్ - జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు

Telangana Polling 2023 LIVE Updates: ఒంటిగంట వరకూ 36.68 శాతం పోలింగ్ - జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు

Telangana Election : కవిత, రేవంత్‌లపై ఫిర్యాదులు - డీఈవో రిపోర్ట్ ఆధారంగా కేసులు పెడతామన్న వికాస్ రాజ్ !

Telangana   Election   :  కవిత,  రేవంత్‌లపై ఫిర్యాదులు - డీఈవో రిపోర్ట్ ఆధారంగా కేసులు పెడతామన్న వికాస్ రాజ్ !

LIC New Policy: జీవితాంతం గ్యారెంటీగా ఆదాయాన్ని ఇచ్చే ఎల్‌ఐసీ కొత్త పాలసీ - జీవన్‌ ఉత్సవ్‌

LIC New Policy: జీవితాంతం గ్యారెంటీగా ఆదాయాన్ని ఇచ్చే ఎల్‌ఐసీ కొత్త పాలసీ - జీవన్‌ ఉత్సవ్‌

Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

టాప్ స్టోరీస్

Salaar: బెస్ట్ క్యాప్షన్ ఇవ్వండి, ఫ్రీగా 'సలార్' టికెట్స్ గెలుచుకోండి - ప్రభాస్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్

Salaar: బెస్ట్ క్యాప్షన్ ఇవ్వండి, ఫ్రీగా 'సలార్' టికెట్స్ గెలుచుకోండి - ప్రభాస్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్

Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!

Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!

Chiranjeevi Telangana Elections: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్‌కు ఫుల్ మీల్స్

Chiranjeevi Telangana Elections: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్‌కు ఫుల్ మీల్స్

Airtel Vs Jio: నెట్‌‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు ఇవే - మినిమం రీఛార్జ్ ఎంతంటే?

Airtel Vs Jio: నెట్‌‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు ఇవే - మినిమం రీఛార్జ్ ఎంతంటే?