(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన వర్షాలు, తేలికపాటి వానలకు అవకాశం - ఐఎండీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా భారీ నుంచి అతిభారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
‘‘నిన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలోని వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్ప పీడన ప్రాంతం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడన ప్రాంతంగా బలపడి ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతం మధ్య భాగాలపై కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 9.5 కిలో మీటర్ల వరకూ విస్తరించి ఉంది. ఇది రాగల 12 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (జూలై 31) ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడాక్కడా ఎల్లుండి చాలా చోట్ల, కురిసే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికల్లాంటివి ఏమీ జారీ చేయలేదు.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 84 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా భారీ నుంచి అతిభారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు అన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. బలమైన గాలులు గంటకు 30 - 40 కిలోమీటర్ల వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
5 day warnings of Andhra Pradesh dated 31.07.2023#IMD#APforecast#MCAmaravati#APweather pic.twitter.com/LrZW3fCLjw
— MC Amaravati (@AmaravatiMc) July 31, 2023