(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: నేడు తెలంగాణలోకి కూడా నైరుతి రుతుపవనాలు, వర్షాలకు ఛాన్స్ - ఐఎండీ
Weather Forecast: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ, రేపు కొన్ని చోట్ల మరియు ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం వుంది.
Weather Latest News: నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి ఈరోజ తెలంగాణ రాష్టంలోని మెదక్ మరియు భద్రాచలం గుండా వెళ్ళుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి ఋతుపవనాలు ఈరోజు తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రప్రదేశ్లోని మరి కొన్ని ప్రాంతాలలో ప్రవేశించాయి. నైరుతి ఋతుపవనాలు రాబోయే 3 నుండి 4 రోజులలో కర్ణాటక, తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాలలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి.
నిన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై వున్న ఉపరితల ఆవర్తనం, ఈరోజు రాయలసీమ మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. ఎత్తులో కొనసాగుచున్నది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల, రేపు మరియు ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం వుంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు, రేపు మరియు ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, వాయువ్య దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.1 డిగ్రీలుగా నమోదైంది. 75 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని చాలా ప్రాంతాలకు, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలకు, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది.