(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: నేడు భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్! రుతుపవనాల గమనం రాష్ట్రంలో ఇలా - ఐఎండీ
Weather Warnings: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల, రేపు మరియు ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం వుంది.
Weather Latest News: నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి ఈరోజూ తెలంగాణ రాష్టంలోని నారాయణపేట, ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపూర్ గుండా వెళ్ళుతుందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి ఋతుపవనాలు రాబోయే 3 నుండి 4 రోజులలో కర్ణాటక లోని మిగిలిన ప్రాంతాలలో, తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి.
నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ - ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ-మధ్య, పరిసర నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో కేంద్రీకృతమై వున్న ఉపరితల ఆవర్తనం, ఈరోజు ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1కి. మీ. నుండి 4.5 కి. మీ. ఎత్తులో కేంద్రీకృతమై వున్నది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల, రేపు మరియు ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం వుంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు, రేపు మరియు ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
నేడు భారీ వర్షాలు
నేడు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (30 - 40 కిలో మీటర్లు) తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, వాయువ్య దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా నమోదైంది. 76 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ చత్తీస్ గఢ్ లోని మరికొన్ని భాగాలు, రానున్న 3, 4 రోజుల్లో దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
సముద్ర మట్టానికి 3.1, 5.8 కిలో మీటర్ల మధ్య గల దక్షిణ ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు రాయలసీమ, పొరుగున ఉందని తెలిపారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది.