(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: నేడు మరింత ఎక్కువ వర్షాలకు అవకాశం, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్: ఐఎండీ
Weather Forecast: ఈ రోజు అక్కడ అక్కడ, రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం వుంది.
Weather Latest News: నిన్నటి ఉపరితల ఆవర్తనం మధ్య మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడినది, ఈ రోజు బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు అంతర్గత కర్ణాటక, కేరళ మీదుగా మరఠ్వాడ నుండి కొమరిన్ ఏరియా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి / గాలి విచ్చిన్నతి కొనసాగుతుంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):
ఈ రోజు అక్కడ అక్కడ, రేపు మరియు ఎల్లుండి కొన్ని చోట్ల తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం వుంది.
వాతావరణ హెచ్చరికలు (Weather warnings)
ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ., రేపు మరియు ఎల్లుండి 40 - 50 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశముంది.
ఇక్కడ ఎల్లో అలర్ట్
మే 12న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ.) కూడిన వర్షాలు తెలంగాణలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల ఈదురు గాలులు గంటకు 4 - 8 కిలో మీటర్ల నుంచి 04 నుంచి 08 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.2 డిగ్రీలుగా నమోదైంది. 65 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని తెలిపారు.
ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.