Weather Latest Update: నేడు, రేపు భారీ వర్షాలకు ఛాన్స్ - ఈ జిల్లాల వారికి ఐఎండీ అలర్ట్
Weather Forecast: ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, రేపు, ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
Weather Latest News: నైరుతి ఋతుపవనాలు ఈరోజు ఉత్తర అరేబియా సముద్రము మరియు మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలు లోకి విస్తరించాయి. నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి ఈరోజు నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకు ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నాయి.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, రేపు మరియు ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు, రేపు భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుండి 40 కి. మి వేగం తో కూడిన ఈదురు గాలులతో వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో) వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, దక్షిణ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా నమోదైంది. 84 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: జూన్ 10న నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. షీర్ జోన్ ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్లు, 5.8 కిలో మీటర్ల మధ్య దాదాపు 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి నడుస్తుందని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాలో తేలికపాటి రాబోయే మూడు రోజులు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలుల వల్ల గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోనూ ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.