News
News
X

Weather Updates: తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు - ఏపీలో ఆ ప్రాంతాల్లో ఉక్కపోత, తేమ అధికం

 The Temperature in Telangana: గత మూడు రోజులుగా మధ్యాహ్నం సమయంలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

FOLLOW US: 

Temperature in Andhra Pradesh; తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గత మూడు రోజులుగా మధ్యాహ్నం సమయంలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇకనుంచి 41 నుంచి 45 డీగ్రీల మధ్యలో ఎండలు ఉంటాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఎండలు ఎక్కువగా ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా మారింది. విశాఖపట్నం​, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.  మహారాష్ట్ర విదర్భ నుంచి ఉత్తర కేరళ వైపు బలమైన వేడిగాలులు వీచనున్నాయి. అదే సమయంలో దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తమిళనాడు, తెలంగాణ, ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలకు తీరంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో పొడి గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉక్కపోత, తేమ ప్రభావం అధికం కావడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీళ్లు అధికంగా తీసుకోవాలని సూచించారు. 

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉక్కపోత, తేమ పెరిగింది. రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలు, కడప​, అనంతపురం జిల్లాల్లో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉండనుందని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు, చిత్తూరు జిల్లా తూర్పు భాగాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు (పల్నాడు ప్రాంతంలో) ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించారు. 

తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. ( The Temperature in Telangana)
తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, నల్గొండ​, వరంగల్ అర్బన్/రూరల్, యాదాద్రి జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, సంగారెడ్డి, సిరిసిల్ల​, సిద్ధిపేట​, పెద్దపల్లి, కొమురం భీం జిల్లాల్లో ఎండలు 41 డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరగనుంది. నమోదుకానున్నాయి. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు నమోదు కావడంతో ఉక్కపోత వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు ఊరట! వరుసగా నేడూ తగ్గిన ధరలు, వెండి ధరలు కూడా కిందికి

Also Read: Horoscope Today 30th March 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామి సూచనలు ఫాలో అయితే మంచిది, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Published at : 30 Mar 2022 07:06 AM (IST) Tags: rains in telangana Weather Updates ap weather updates AP Temperature Today Telangana Temperature Today

సంబంధిత కథనాలు

Petro-Diesel Price, 18 August: పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయంటే!

Petro-Diesel Price, 18 August: పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయంటే!

Weather Latest Update: 19న మరో అల్పపీడనం, దీని ఎఫెక్ట్ ఏంటంటే! ఈ ప్రాంతాలవారికి అలర్ట్: IMD

Weather Latest Update: 19న మరో అల్పపీడనం, దీని ఎఫెక్ట్ ఏంటంటే! ఈ ప్రాంతాలవారికి అలర్ట్: IMD

Gold-Silver Price: నేడు మరింత తగ్గిన గోల్డ్ రేట్ - సిల్వర్, ప్లాటినం కూడా

Gold-Silver Price: నేడు మరింత తగ్గిన గోల్డ్ రేట్ - సిల్వర్, ప్లాటినం కూడా

కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ

కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ

వెయ్యి కిలోమీటర్లు దాటిన "ప్రజాసంగ్రామ యాత్ర"

వెయ్యి కిలోమీటర్లు దాటిన

టాప్ స్టోరీస్

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

KTR :  ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !