Warangal Student: జర్మనీలో పడవ ప్రమాదం- వరంగల్ విద్యార్థి గల్లంతు, సాయం కోసం ఫ్యామిలీ ఎదురుచూపులు
కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎమ్మెస్సీ చదువుదామని జర్మనీ వెళ్లిన విద్యార్థి గల్లంతు ఆందోళన కలిగిస్తోంది. అతను ఏమయ్యాడో అని ఫ్యామిలీ టెన్షన్ పడుతోంది.
జర్మనీలో జరిగిన ఓ పడవ ప్రమాదంలో గల్లంతైన తెలంగాణ విద్యార్థి ఆచూకీ కనిపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం రిక్వస్ట్ చేసింది. కేంద్ర విదేశాంగశాఖతో పాటు బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయానికి మంగళవారం లెటర్స్ రాసింది తెలంగాణ ప్రభుత్వం.
కెమికల్ ఇంజనీరింగ్ అయిన వరంగల్‌కు చెందిన కడారి అఖిల్(25) జర్మనీలో ఎంఎస్ చదివేందుకు 2018లో వెళ్లాడు. మే 8న జరిగిన పడవ ప్రమాదంలో అఖిల్ గల్లంతయ్యాడు. అప్పటి నుంచి అఖిల్ కోసం గాలిస్తున్నారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు తెలియజేశారు అఖిల్ సోదరి. సాయం చేయాలని అభ్యర్థించింది.
అఖిల్ సోదరి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. విషయాన్ని కేంద్రానికి తెలియజేసి అఖిల్ ఫ్యామిలీకి అండగా నిలబడాలని ప్రభుత్వ ప్రధాన ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు మంత్రి కేటీఆర్. దీంతో కేంద్రానికి, జర్మనీలోని భారత్ రాయబార కార్యాలయానికి లెటర్లు రాశారు సీఎస్.
అఖిల్ కుటుంబాన్ని కూడా స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. బుధవారం ఉదయం వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించారు. పరిస్థితిని తెలుసుకున్నారు. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వాళ్ళను ఓదార్చారు. మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, ఆ కాలనీ వాసులు ఉన్నారు.
Will speak to the authorities in Germany and do our best Rasagnya
— KTR (@KTRTRS) May 10, 2022
My team @KTRoffice will keep you informed on any updates that we will get https://t.co/0BZTIh3Roh
వరంగల్‌లోని కరీమాబాద్‌లోని మధ్య తరగతి కుటుంబం కడారి పరశు రాములు, అన్నమ్మ కొడికే అఖిల్. ఉన్నత చదువుల కోసం జెర్మనీ వెళ్ళాడు. కొద్ది కాలంగా అక్కడే సెటిల్ అయ్యాడు. 5 రోజుల క్రితం జెర్మనీలోనే అఫీస్ పనిపై వెళ్లి నీటిలో మిస్ అయ్యాడు. ఆయన వెంట ఉన్న మిత్రులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. దేశం కాని దేశం కావడంతో సమాచారం సరిగా లేదు. దీంతో కరీమాబాద్‌లోని అఖిల్ అమ్మా, నాన్న ఆందోళన చెందుతున్నారు. కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు.