By: ABP Desam | Updated at : 02 Jun 2023 11:45 AM (IST)
Edited By: jyothi
పాలకుర్తిలో పండుగలా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు ( Image Source : Dayakar Rao Errabelli Facebook )
Warangal News: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు ప్రతి పల్లె పల్లెలో పండుగలా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ వేడుకల్లో పాల్గొనాలని అదేశించారు. పాలకుర్తి నియోజకవర్గం విస్తరించి ఉన్న జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల అన్ని శాఖల అధికారులను మంత్రి పాలకుర్తిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేకంగా గురువారం సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పారు. ఘనంగా, పండుగలా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రుజలను భాగస్వాములను చేస్తూ జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు నిర్వహించే అన్ని ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. మన రాష్ట్రం దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది. అన్ని శాఖల్లో అనేక అవార్డులు సాధించాం. ఈ వేడుకలను విజయోత్సవంగా నిర్వహించాలని ఆదేశించారు. మిగతా శాఖలకు భిన్నంగా ఎక్కువ శాఖలతో మనకే ఎక్కువ అనుబంధం ఉంది. అందుకే ఆయా ఉత్సవాలను నిర్వహించే బాధ్యత మనపై ఎక్కువగా ఉందని సూచించారు. 21 రోజుల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖలు ఎక్కువ భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తూనే పాలకుర్తి నియోజకవర్గం లో ప్రత్యేకంగా మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి నిర్ణయించారు.
ఈ సమీక్షలో జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, డీఆర్డీఓ రాంరెడ్డి, ఏపీడీ నూరుద్దీన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం
JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
TS EAMCET: ఎంసెట్ బైపీసీ స్పాట్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?
TS ICET: టీఎస్ ఐసెట్-2023 రిపోర్టింగ్ గడువు పెంపు, ఎప్పటివరకంటే?
Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>