అన్వేషించండి

Congress Politics: ఆస్తి గొడవలతో బీఆర్ఎస్‌ గల్లంతు, 90 సీట్లతో మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్: మహేష్ కుమార్ గౌడ్

Telangana News | కాంగ్రెస్ పార్టీ 90 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ క‌నపడదు అన్నారు.

ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో 90 సీట్లతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని టపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఆ పార్టీ కనిపించదని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఖమ్మంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గిరిజన తండాలను గుర్తించిన తొలి నేత ఇందిరా గాంధీ. ఆదివాసుల అభివృద్ధి కోసం ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టానికి జీవం పోసిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదే అన్నారు.

ఆదివాసీలను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం

 ‘కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేక చట్ట సవరణలు చేసింది. కానీ  గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పోడు భూముల కోసం పోరాడిన గిరిజనులపై కేసులు పెట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం. ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం కింద 6.69 లక్షల ఎకరాలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్. ప్రభుత్వం చేపట్టిన ఇందిర సౌర గిరి జల వికాసం పథకంతో గిరిజనుల జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. గిరిజనులకు పిసిసిలో సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తాను.

వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ గల్లంతు

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు నుంచి సన్న బియ్యం వరకు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తోంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కుల గణన (Caste Census) సర్వే పూర్తి చేసిన ఘనత సీఎం రేవంత్, మంత్రులదే. జల్-జమీన్-జంగల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన ఏకైక పార్టీ కాంగ్రెస్. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు .. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆ పార్టీని ఆదరించరు. తెలంగాణలో 90 సీట్లతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. బిఆర్ఎస్ లో ఆస్తుల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ క‌నపడదు’ అని మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget