అన్వేషించండి

వరంగల్ బీఆర్‌ఎస్ ఎమ్యెల్యేల్లో టెన్షన్‌కు కారణమేంటి?

హైదరాబాద్ తరువాత పెద్దనగరంగా ఉన్న వరంగల్‌లో గులాబీ పార్టీకీ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఇద్దరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీనీ వీడారు.

ఉద్యమ జిల్లాగా పేరు ఉన్న వరంగల్ జిల్లా అధికార పార్టీ నేతల‌్లో ఎమ్మెల్యేలలోనూ టెన్షన్ నెలకొంది. రానున్న ఎన్నికలలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఎవరు గెలుస్తారనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే  జిల్లాలో కొందరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీనీ వీడి ఇతర పార్టీలలో జాయిన్ అయ్యారు. ఇంకొందరు జాయిన్ కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అసలు ఇంతకీ ఆ జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో? 

ఓరుగల్లు ఉద్యమ పార్టీకి షాక్‌లు

హైదరాబాద్ తరువాత పెద్దనగరంగా ఉన్న వరంగల్‌లో గులాబీ పార్టీకీ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఇద్దరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీనీ వీడారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారే కాలానికి తగ్గట్లు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అన్నట్లుగా ఇప్పుడు అలాంటి పరిస్థితే వరంగల్ గులాబీ పార్టీలోనూ నెలకొంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు నుంచి గులాబీ పార్టీకి కాస్తంత పట్టు ఉన్న జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకటి. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ జిల్లా బీఆర్ఎస్‌కు కంచుకోటలా మారింది. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ అధిక్యత ప్రదర్శించిన జిల్లా వరంగల్ జిల్లానే.

ప్రస్తుతం ఉన్న బలాన్ని చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాల అభ్యర్థులతోపాటు పదకొండు అసెంబ్లీలకు గులాబీపార్టీ అధీనంలోనే ఉన్నాయి. ఇవే కాక ఎనిమిది ఎమ్మెల్సీలు ఆరు జిల్లా పరిషత్‌లను సొంతం చేసుకొని మిగిలిన రాజకీయ పార్టీలకు ఏ మాత్రం అందనంత అధిక్యత ప్రదర్శిస్తోంది. ఇలాంటి వేళ కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు అధికార పార్టీలో నెలకొన్న అధిపత్య పోరు కారణంగా పార్టీపై వ్యతిరేకత మొదలైంది. ఇతర పార్టీలకి అధిక్యత అంతకంతకూ ఎక్కువ అవుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా.. వీటిలో ఇప్పుడు పలు అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీలు బలపడ్డాయన్న సర్వే రిపోర్టులు గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉమ్మడి జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాలు ఇతర పార్టీలకు వెళ్లిపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనేది బీఆర్ఎస్ శ్రేణుల మాటే. ఎన్నికల్లో గెలుపు మీద ఫోకస్ పెట్టిన గులాబీ బాస్‌కు గెలుపే అంతిమ లక్ష్యమైనప్పుడు సిట్టింగుల విషయంలో ఆయన కఠువుగా వ్యవహరించటానికే ఎక్కువ అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది.

ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సమావేశాల్లోనూ గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తామని స్పష్టం చేసిన కేసీఆర్ మాటల్ని గుర్తు తెచ్చుకుంటున్న అధికార పార్టీ నేతలకు ఇప్పుడు కంటి మీద కనుకు రాని పరిస్థితిగా ఉంది. ఇటీవల కాలంలో జరిపిన అన్ని సర్వేల్లోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగానే అనేక స్థానాల ఫలితాలు వస్తాయన్న విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్న వేళ.. ఉమ్మడి వరంగల్ జిల్లాపై అటు అధికారపార్టీలోనే కాదు సిట్టింగుల్లోనూ టెన్షన్ మొదలైనట్లుగా చెబుతున్నారు.

రోజులు గడిచే కొద్దీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇతర పార్టీలు అంతకంతకూ బలపడుతున్నాయనే మాట వినిపిస్తోంది. పలువురు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా వస్తున్న ప్రకటనలు ఇప్పుడు చర్చగా మారుతున్నాయి. మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేల్లో.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్దన్నపేటలో ఆరూరి రమేశ్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మినహా మిగిలిన వారి పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్నట్లు ప్రచారం జరుగుతోంది..

సర్వేల్లో ఆదరణ కరవు?

సర్వేల్లో ఆదరణ కోల్పోయినట్లుగా ప్రచారం జరుగుతున్న సిట్టింగులు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా కార్యక్రమాల్ని చేపడుతున్నారు. రానున్న కొద్ది నెలల్లో తమ గ్రాఫ్ మెరుగుపరుచుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. పలువురు మాజీలను కొత్తగా బరిలోకి దింపే ఆలోచన గులాబీ బాస్ ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో.. పోటీ మరింత పెరిగి.. ఎవరికి వారు తామే తగిన అభ్యర్థి అన్న భావన కలిగేలా ప్రయత్నిస్తున్నారు.

ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న క్యాడర్

కొన్ని నియోజకవర్గలలో టీఆర్ఎస్ నాయకుల మధ్య అధిపత్య పోరు చాలా ఎక్కువవడంతో ఏ నాయకునితో టచ్ లో ఉండాలి, ఎన్ని చిక్కులు వస్తాయో అని సెకండ్ క్యాడర్ అయోమయంలో ఉన్నారు. సర్వే రిపోర్ట్ లతో ఎమ్మెల్యేలు... మాకు ఈసారైనా టికెట్ దక్కుతుందో లేదో అని అధికార పార్టీ నేతలను అధిష్టానం ఎలా గాడిన పెడుతుందో...రానున్న రోజులలో సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్‌పై  ఫోకస్ ఏమేరకు ఉంటుందో చూడాలీ.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget