అన్వేషించండి

Telangana Municipal Elections 2026: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్- వరుసగా మూడు రోజుల పాటు సెలవులు!

Telangana Municipal Elections 2026:తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ విద్యాసంస్థలకు వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్ నుంచి 13 ఫలితాల వరకు సెలవులు ప్రకటించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది.
  • ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
  • పోలింగ్, కౌంటింగ్ కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం.
  • అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Telangana Municipal Elections 2026: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠంకు తెర దించుతూ సాగిన ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనడంతో ఆయా పార్టీ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీల్లోని కీలక నేతలంతా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 

ఎన్నికల షెడ్యూల్‌

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలతోపాటు వివిధ మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 3వ తేదీ నాటికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది.  క్రమంలోనే ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. 

మరోవైపు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్ల ఏకగ్రీవాల హడావిడి నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురు చూసే ఫలితాల ప్రక్రియను ఫిబ్రవరి 13 చేపడతారు. 

విద్యార్థులకు పండగ

సాధారణంగా ఫిబ్రవరి నెలలో స్కూళ్లకు సెలవులు ఉండవు. కానీ ఎన్నికల హడావిడి కారణంగా పాఠాల విద్యార్థులకు సెలవులు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ దృష్ట్యా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాలుగా పాఠశాలను లేదా దానికి సమీపంలోని భవనాలు వినియోగించనున్నారు. అందుకే ఆ ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తర్వాత వచ్చేది రెండో శనివారం కావడంతో ఆ రోజు ఎలాగూ సెలవు ఉంటుంది. ఆదివారం నార్మల్‌గానే సెలవు రోజు. అంటే దాదాపు వారంలో నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి.  ఇప్పటి వరకు అధికారులు ఈ సెలవులపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ప్రకటన రానుంది. 

ఎన్నికల కోసం విస్తృత ఏర్పాట్లు 

ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటు వంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లకు ఎటు వంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. పోలింగ్, కౌంటింగ్ పాదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  

Frequently Asked Questions

తెలంగాణలో ఎన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి?

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు, వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ఎప్పుడు ముగిసింది?

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఫిబ్రవరి 3వ తేదీ నాటికి ముగిసింది. దీనితో బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మరియు ఫలితాల ప్రకటన ఎప్పుడు జరుగుతుంది?

ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత, ఎన్నికల ఫలితాల ప్రక్రియను ఫిబ్రవరి 13న చేపడతారు.

మున్సిపల్ ఎన్నికల కారణంగా విద్యార్థులకు సెలవులు ఎప్పుడు ఉంటాయి?

ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది, కౌంటింగ్ కేంద్రాలుగా పాఠశాలలు వినియోగించనున్నారు. దీంతో వారంలో నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget