Aroori Ramesh: బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట
Telangana News: బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని రాష్ట్ర డీజీపీ, వరంగల్ పోలీస్ కమిషనర్ లను కోర్టు ఆదేశించింది.
Telangana High Court orders one plus one security for Aroori Ramesh: హైదరాబాద్: బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆయనకు కేటాయించిన గన్ మెన్లను తొలగించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆరూరి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు.
ఆరూరి రమేష్ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వరంగల్ ఎంపీ సీటు ఆశించిన ఆరూరి రమేష్.. బీఆర్ఎస్ తనకు ఛాన్స్ ఇవ్వకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ అనుకున్నది సాధించుకున్నారు. బీజేపీ అధిష్టానం వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చింది. ఈ క్రమంలో గతంలో తనకు కేటాయించిన గన్ మెన్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆరూరి రమేష్ కు వన్ ప్లస్ వన్ భద్రత (1 Puls 1 security) కేటాయించాలని ఆదేశించింది. ఆరూరి రమేష్ కు భద్రతపై తెలంగాణ డీజీపీ, వరంగల్ పోలీస్ కమిషనర్ కు హైకోర్టు ఆదేశించింది.