Warangl Prajavani : ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నాలు - వరంగల్ అధికారులకు కొత్త టెన్షన్ !
Warangal Collector : సమస్యలు పరిష్కారం కావడం లేదని వరంగల్ ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు. ఇవి అంతకంతకూ పెరుగుతూండటంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
suicide attempts in Warangal Prajavani : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి పేరుతో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం, పరిష్కరించడం కోసం ప్రతి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజావాణిలో ఎవరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడతారో అని అధికారులు టెన్షన్ పడుతున్నారు. తమ సమస్య గురించి చెప్పక ముందే.. తాము చాలా కాలం నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని పరిష్కారం కావడం లేదని కలెక్టర్ సాక్షిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు.
ఎక్కువ భూ సమస్యలు పరిష్కారం కావడం లేదనే ఆత్మహత్యాయత్నాలు
ప్రజావాణిలో కలెక్టర్ కు సమస్యలను విన్నావించుకోవడానికి వచ్చిన భాదితులు అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా సమస్యను పరిష్కరించడం లేదని జనగామ కలెక్టర్ ఎదుట ఆత్మహత్యాయత్నం ల పరంపర కొనసాగుతుంది. జనగామ జిల్లా కలెక్టర్ లో మూడు వారాలుగా ఇదే తంతు కొనసాగుతుంది. భాదితులు పురుగుల మందు, పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. జూన్ 24 వ తేదీన సోమవారం రోజున జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నర్సయ్య అనే రైతు తన 4 ఎకరాల భూ వివాదంను రెవెన్యూ అధికారులు పరిష్కరించడం లేదని ప్రజావానికి వచ్చిన నర్సయ్య విసుగు చెంది జనగామ కలెక్టర్ కార్యాలయం మీదికి ఎక్కి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు.
భూ సమస్యల పరిష్కారం అధికారులకు పెద్ద సవాల్
సరిగ్గా జూన్ 30 తేదీన కూడా ఇలాంటి ఘటన జరిగింది. నర్మెట గ్రామానికి చెందిన మహిళ రైతు సైతం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. నర్మెట్ట గ్రామానికి చెందిన జంగిటి అంజయ్య , జంగిటీ మల్లయ్య, విజయ్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, భూమి పేపర్లు మా నాన్న పేరు మీద ఉన్న అధికారులతో కుమ్మక్కై కబ్జా చేస్తున్నారని అధికారులకు, పోలీస్ లకు ఎన్ని సార్లు విన్నవించుకున్నారు ఫలితం లేక ఆత్మహత్య చరణ్యమైందని మహిళ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాల కోసం మరి కొంతమంది
సోమవారం ప్రజావాణి లో కూడా కలెక్టర్ ఎదుట ఓ వికలాంగుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పాకాల రమేష్ కు సదరం క్యాంపులో 85 శాతం వికలాంగుడిగా సర్టిఫికెట్ వచ్చిన వికలాంగుల పింఛన్ రావడంలేదంటూ పెట్రోల్ బాటిల్ తో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేశాడు. తన భార్య, పిల్లలను పోషించలేకపోతున్నానని కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తో తన గోడును వెళ్లబోసుకున్నారు. మూడు వారాలుగా వరుస సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో జనగాం జిల్లా కలెక్టర్, రెవిన్యూ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యేక సిబ్బందిని నియమించి అలాంటి ఘటనలను నిరోధించాలని అనుకుంటున్నారు.