అన్వేషించండి

Singareni Elections: సింగరేణి కార్మికుల్లో టెన్షన్! అసలు ఎన్నికలు జరుగుతాయా? కోర్టుతీర్పు ఎవరికి అనుకూలం?

Singareni Elections: తెలంగాణ వ్యాప్తంగా ఆరు జిల్లాలో బొగ్గుగనులు విస్తరించి ఉన్నాయి. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఇంధన శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి.

Singareni News: అధికార పార్టీ నిర్ణయాలు బొగ్గు గని కార్మికుల పాలిట శాపంగా మారాయి. గుర్తింపు సంఘాలకు జరగాల్సిన ఎన్నికలపై ప్రభుత్వాల స్వార్థపూరిత ప్రయోజనాల కోసం కార్మికులు బలవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికలు జరిగే సమయానికి ప్రభుత్వ పెద్దలు పరోక్షంగా కేసులు వేయించి ఎన్నికలు జరగకుండా చేస్తున్నారు. ఈనెల 27వ తేదీన జరగాల్సిన సింగరేణి కార్మిక ఎన్నికలపై సైతం నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎన్నికలు నిర్వహించలేమంటూ కోర్టులో కేసు వేయడంతో  ఎన్నికలు జరుగుతాయా... జరగవా అనే దానిపై రేపు 21వ తేదీన తీర్పు వెలువడనుంది. దీంతో కార్మిక సంఘాలు, కార్మికుల్లో టెన్షన్ నెలకొంది.

తెలంగాణ వ్యాప్తంగా ఆరు జిల్లాలో బొగ్గుగనులు విస్తరించి ఉన్నాయి. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఇంధన శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఎన్నికల నిర్వహణ కోసం డిసెంబర్ 4వ తేదీన లేబర్ శాఖ, బొగ్గుగని యూనియన్లు, బొగ్గుగని ఉద్యోగులు సమావేశమై ఎన్నికల నిర్వహణ, గుర్తుల కేటాయింపు, నామినేషన్ల పై నిర్ణయం తీసుకున్నారు. దీంతో యూనియన్లు, కార్మికులు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఇంధన శాఖ కోర్టులో కేసు వేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహించలేమని ఇంధన శాఖ అందులో పేర్కొంది.   హైకోర్టులో 18 వ తేదీన తీర్పు రావాల్సి ఉండగా 21వ తేదీకి వాయిదా పడింది. దీంతో రేపు అనగా 21వ తేదిన ఎన్నికలు జరుగుతాయా... లేదా అనే దానిపై తీర్పు వెలువడనుంది.

తెలంగాణలోని బొగ్గుగనుల్లో 1998 నుండి ఎన్నికలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 6 సార్లు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 13 బొగ్గుగని కార్మిక గుర్తింపు సంఘాలు ఉన్నాయి. 2017 నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు.  2019 వరకు కాలపరిమితి అప్పటి నుంచి ఇప్పటివరకు జరగలేదు. 2003 మూడు వరకు రెండు సంవత్సరాల కాలపరిమితి మాత్రమే ఉండేది ఆ తర్వాత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ మేరకు కార్మికులు ఇవ్వడం ఒప్పుకోవడంతో రెండు సంవత్సరాల పదవి కాలాన్ని నాలుగు సంవత్సరాలు చేశారు. 2019 లో జరపాల్సిన ఎన్నికలను జరపకపోవడంతో AITUC 2021 లో కొట్టుకు వెళ్ళింది దీంతో 2022లో కోర్టు ఎన్నికల్లో జరపాలని చెప్పడంతో కేంద్ర లేబర్ కమిషనర్ ను ఆదేశించింది.

2023 అక్టోబర్ 5తేదీన ఎన్నికలకు యాజమాన్యం ఒకే చెప్పింది.  ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందనే ఆలోచనతో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలను జరగకుండా చేయడం కోసం ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులతో కోర్టులో కేసు వేయించిందని యూనియన్ నాయకులు చెప్పారు. రెండు నెలల్లో  అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికల నిర్వహణ కష్టమవుతుందని చెప్పడంతో కోర్టు ఎన్నికలను డిసెంబర్ 27 కు వాయిదా వేసింది.  దీంతో డిసెంబర్ 4న లేబర్ కమిషనర్, సింగరేణి యూనియన్ నాయకులు, ఉద్యోగులను కూర్చోబెట్టి ఎన్నికలపై చర్చించారు. దీంతో 27న ఎన్నికలు జరుగుతాయి సర్వం సిద్ధమని చెప్పడంతో కార్మిక యూనియన్లు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. కానీ మరో కోర్టు కేసు వచ్చి పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎంపీ ఎలక్షన్స్ ముందు సింగరేణి ఎన్నికలు జరుగుతాయని చెప్పింది. కాంగ్రెస్  అనుబంధ యూనియన్ కు అనుకూలంగా విజయం దక్కకపోతే ఎంపీ ఎన్నికల్లో ప్రభావం పడుతుందని ప్రభుత్వం ఆలోచించింది.

డిసెంబర్ 21న తీర్పు

అందుకే ఇంధన శాఖతో కోర్టులో కేసు వేయించిందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. రేపు అనగా డిసెంబర్ 21వ తేదీన కోర్టు తీర్పు ఉండడంతో సింగరేణి యూనియన్లు కార్మికులు తీర్పుపై వేచి చూస్తున్నారు. అయితే యూనియన్ నాయకులు మాత్రం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి. కాబట్టి తీర్పు ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని ఐ ఎన్ టి యు సి కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు రాజేందర్ అన్నారు. ఎన్నికలు జరగకపోవడం వల్ల కార్మికుల ప్రయోజనాలు సేఫ్టీ సంబంధిత అంశాలపై మేనేజ్మెంట్తో చర్చించలేకపోతున్నామని మూడు సంవత్సరాల నుండి ఆ సమావేశాలు జరగడంలేదని యూనియన్ నాయకుడు రాజేందర్ చెప్పారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి బొగ్గు గనుల విషయానికి వస్తే.. ఇక్కడ ఓపెన్ కాస్ట్ లతో కలుపుకొని ఐదు గనులు ఉన్నాయి. ఇందులో 5 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. 6 సంవత్సరాల తరువాత ఎన్నికలు జరుగుతుండటంతో హడావుడి నెలకొంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా గుర్తింపు పొందిన INTUC, AITUC,  తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మధ్య పోటీ ఉంటుంది అయితే కథ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు ఒత్తుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం జరిగింది అదే పొత్తు ఎనీ అసెంబ్లీగా భావించే వగ్గుకొని కార్మిక సంఘాల ఎన్నికల్లో కొనసాగుతున్న లేదా అనే అంశం చర్చనీ అంశంగా మారింది ఈ రెండు నెలల మాట పక్కన పెడితే తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం గత ఎన్నికల్లో ఆరు జిల్లాల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది దీనికి తోడు సింగరేణి కారుణ్య నియామకాలను ఈ మధ్యకాలంలో చేపట్టడంతో కార్మికులు తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘానికి మద్దతు తెలిపారని ప్రచారం లేకపోలేదు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయినINTUC కి కలిసొచ్చే అంశమని ఆ సంఘం నాయకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రేపు వెలువడే కోర్టు తీర్పుతో ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనేది తేలనుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
Sridevi Drama Company Latest Promo: శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?
శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?
Amardeep Chowdary: అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
Embed widget