News
News
X

Narayanpet: ఇతనికి ఆ మహిళలంటే మోజు! పచ్చి అబద్ధాలతో నలుగురితో కాపురం

మొదటి భార్యకు తెలియకుండా 2012లో అప్పటికే పెళ్లై ఒకపాప ఉన్న అప్పిరెడ్డిపల్లికి చెందిన మహిళను గుళ్లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.

FOLLOW US: 

జీవితంలో సరిగ్గా స్థిరపడని పెళ్లీడుకొచ్చిన యువకులకు వివాహం కావడం ఈ రోజుల్లో ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కానీ, నారాయణ పేటకు చెందిన ఈ 44 ఏళ్ల వ్యక్తి మాత్రం ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని మాయమాటలు చెప్పి వలలో వేసుకొని వివాహం చేసుకున్నాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో నిందితుడి బాగోతం బయటికి వచ్చింది. మొదటి భార్యకు తొలుత ఈ విషయం తెలియడంతో పోలీసులు ఇతని లీలలపై విచారణ చేశారు.

మాయ మాటలతో నమ్మించి.. ఏకంగా నలుగురిని పెళ్లి చేసుకున్న ఇతను.. ఇంటికి పెద్ద దిక్కులేని, ఏం చేసినా అడిగేవారు లేని మహిళలనే టార్గెట్ గా చేసుకున్నాడు. అలాంటివారిని లొంగదీసుకుని మాయమాటలతో పెళ్లి చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నారాయణపేట జిల్లాలో ఆ మండలానికి చెందిన అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటనర్సింహా రెడ్డి అనే 44 ఏళ్ల వ్యక్తి తాపీ మేస్త్రీ. మొదటిసారిగా 2009లో నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని రాంకిష్టయ్యపల్లికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఒక పాప, బాబు పుట్టారు. 

ఇదిలా ఉండగా, మొదటి భార్యకు తెలియకుండా 2012లో అప్పటికే పెళ్లై ఒకపాప ఉన్న అప్పిరెడ్డిపల్లికి చెందిన మహిళను గుళ్లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. తరవాత రెండో పెళ్లి విషయం మొదటి భార్యకు తెలిసింది. భర్త వేధింపులు భరించలేక, అతడి వ్యవహారం నచ్చక కొన్నేళ్లుగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయి దూరంగా ఉంటోంది. 

నర్సింహా రెడ్డి అప్పుడప్పుడు పని కోసం హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో అక్కడ పనిచేస్తున్న కోయిలకొండ మండలానికి చెందిన మహిళను మూడోపెళ్లి చేసుకున్నాడు. అక్కడే కాపురం కూడా పెట్టేశాడు. భర్త ఇంటికి రావడం లేదని రెండో భార్య వెళ్లి ఆరా తీయగా మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు ఆమెకు తెలిసింది. ఆ తర్వాత నుంచి ఆమె కూడా దూరంగా ఉండడం మొదలుపెట్టింది. 

ఈ క్రమంలోనే నారాయణ పేట మండలం అప్పక్‌పల్లికి చెందిన మరో మహిళకు తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పి గత నెలలో నాలుగో పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ మొదటి భార్య వద్దకు వెళ్లి వేధిస్తుండటంతో ఆమె సఖీ సెంటర్‌ను ఆశ్రయించారు. వారి ద్వారా షీ టీం పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్‌ గౌడ్‌ తెలిపారు. మరో నలుగురైదుగురు ఇతని చేతిలో మోసపోయినట్లుగా సఖీ కేంద్రం నిర్వహకుల విచారణలో వెల్లడైంది. రెండు నెలలకు ఓసారి ఎవరో ఒక మహిళను ఇంటికి తీసుకువస్తున్నట్లు తమ విచారణలో తేలిందని సఖీ కేంద్రం నిర్వహకులు పోలీసులకు చెప్పారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

Published at : 07 Aug 2022 11:50 AM (IST) Tags: Narayanpet marriage Narayanpet news Narayanpet mandal fraud marriage

సంబంధిత కథనాలు

Warangal News : వరంగల్ లో నకిలీ ఎన్ఐఏ అధికారుల హాల్ చల్, రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్!

Warangal News : వరంగల్ లో నకిలీ ఎన్ఐఏ అధికారుల హాల్ చల్, రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్!

TRS Leader Dasara : అన్ని దానాల్లోకెల్లా లిక్కర్ దానం గొప్ప అనుకుంటాడు ఆ టీఆర్ఎస్ లీడర్ - కేసీఆర్, కేటీఆర్ కటౌట్ల సాక్షిగా ...

TRS Leader Dasara : అన్ని దానాల్లోకెల్లా లిక్కర్ దానం గొప్ప అనుకుంటాడు ఆ టీఆర్ఎస్ లీడర్ - కేసీఆర్, కేటీఆర్ కటౌట్ల సాక్షిగా ...

Mulugu News: ములుగు అదనపు కలెక్టర్ కు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం, శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

Mulugu News: ములుగు అదనపు కలెక్టర్ కు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం, శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

Weather Updates: బలపడుతోన్న అల్పపీడనం - అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: బలపడుతోన్న అల్పపీడనం - అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో 13 రోజులపాటు రాహుల్ భారత్ జోడో యాత్ర, పూర్తి షెడ్యూల్ ఇదే

తెలంగాణలో 13 రోజులపాటు రాహుల్ భారత్ జోడో యాత్ర, పూర్తి షెడ్యూల్ ఇదే

టాప్ స్టోరీస్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్