అన్వేషించండి

Warangal Crime News: భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన

Crime News | వరంగల్‌లో ఆస్తి గొడవల వల్ల మనస్తాపంతో రాజేష్ అనే వ్యక్తి భార్యకు వీడియో కాల్ చేస్తూ, ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాజీపేటలో రాజేష్ నాయక్ భార్యతో వీడియో కాల్‌లో ఆత్మహత్య.
  • ఆస్తి గొడవలతో భార్యతో కలహించి తీవ్ర మనస్తాపం చెందాడు.
  • భర్త బెదిరింపుగా భావించి భార్య మొదట తేలికగా తీసుకుంది.
  • భార్య, కుమారుడిని విడిచి రాజేష్ ఆత్మహత్య; పోలీసుల దర్యాప్తు.

కాజీపేట: వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో వీడియో కాల్‌ మాట్లాడుకుంటూ, ఆమెకు చూపిస్తూ.. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి రాజేశ్‌ నాయక్ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం రాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు రాజేశ్‌ నాయక్‌ వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

రైలుకు అడ్డంగా వెళ్తూ భార్యకు వీడియో

అయితే, గత కొంతకాలంగా రాజేష్ భార్యకు, ఆయన తల్లిదండ్రులకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి మరోసారి భార్యతో గొడవ జరిగింది. రాజేశ్‌ తీవ్ర మనస్తాపానికి గురై ఇల్లు వదిలి బయటకు వెళ్లిపోయాడు. ఆపై రైలు పట్టాల మీదకు చేరుకుని, భార్యకు నేరుగా వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్తూ ఎదురుగా వస్తున్న రైలును చూపించాడు. నిజంగానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భర్త రాజేష్ తనను కేవలం భయపెట్టడానికే అలా చేస్తున్నాడని భావించిన భార్య ఆ విషయాన్ని లైట్ తీసుకుంది.

Also Read: Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట

మరోవైపు రాజేశ్‌ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాత్రంగా బంధువులు, స్నేహితులు, సన్నిహితుల ఇండ్లు, పలు చోట్ల వెతికారు. మరుసటి రోజు ఉదయం కాజీపేట సమీపంలోని రైలు పట్టాలపై ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లి చూశారు. అది రాజేష్ మృతదేహమేనని గుర్తించి వారు కన్నీళ్లు పెట్టుకున్నాడు. మృతుడు రాజేష్‌కు భార్యతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

క్షణికావేశంలో ఒకరు తీసుకునే నిర్ణయాలు ఓ కుటుంబాన్ని రోడ్డున పడేస్తాయని.. ఇలాంటి పనులు చేయవద్దని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. సమస్యలు ఉంటే కుటుంబసభ్యులు కూర్చుని చర్చించుకోవాలని, లేకపోతే పిల్లలు అనాథలు అయిపోతారని, తల్లిదండ్రుల బాగోగులు చూసేవారు ఉండరని పేర్కొన్నారు.

Frequently Asked Questions

కాజీపేటలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరు?

వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేసే రాజేశ్ నాయక్ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రైలు కింద పడి మరణించాడు.

రాజేష్ నాయక్ ఆత్మహత్యకు గల కారణం ఏమిటి?

ఆస్తి పంపకాల విషయంలో భార్యకు, అతని తల్లిదండ్రులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి భార్యతో గొడవ పడిన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజేష్ నాయక్ తన ఆత్మహత్యను ఎలా చేశాడు?

అతను రైలు పట్టాలపైకి వెళ్లి, భార్యకు వీడియో కాల్ చేసి, ఎదురుగా వస్తున్న రైలును చూపిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట భార్య అతని మాటలను తేలికగా తీసుకుంది.

రాజేష్ నాయక్ వృత్తి ఏమిటి?

అతను వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget