జనగామ జిల్లాలో ఒక కౌన్సిలర్ అర్ధరాత్రి వేళ ఓ వృద్ధురాలి ఇంట్లోకి నగ్నంగా చొరబడి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Jangaon Crime News | జనగామ జిల్లా చాగల్లులో మున్సిపల్ కౌన్సిలర్ సంపత్ రాజ్ అర్ధరాత్రి నగ్నంగా ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

- జనగామ కౌన్సిలర్ అర్ధరాత్రి మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డాడు.
- వృద్ధురాలిపై అత్యాచార యత్నంతో, కేకలు విన్న స్థానికులు చేరారు.
- బాత్రూంలో దాక్కున్న నిందితుడిని బంధించి పోలీసులకు అప్పగించారు.
Jangaon Crime News | జనగామ: సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక కౌన్సిలర్ అర్ధరాత్రి వేళ వికృత రూపాన్ని బయటపెట్టి కామంధుడిలా మారి దారుణంగా ప్రవర్తించాడు. వార్డు కౌన్సిలర్ అర్ధరాత్రి వేళ ఒక మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడటమే కాకుండా, ఆపై వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలో ఈ ఘటన జరిగింది.
నగ్నంగా ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సెలర్..
బాధిత మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ సంపత్ రాజ్ అర్ధరాత్రి సమయంలో ఒంటిపై నూలుపోగు లేకుండా స్థానికంగా ఉండే ఒక మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢనిద్రలో ఉన్న ఆమెపై అతడు అత్యాచారానికి ప్రయత్నించాడు. అసలేం జరుగుతుందో అర్థంకాక భయాందోళనకు గురైన ఆ వృద్ధురాలు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న వెంటనే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చాలా మంది ఇంట్లోకి రావడంతో భయాందోళనకు గురైన కౌన్సిలర్ సంపత్ రాజ్ తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు.
అయితే, స్థానికులు బాత్రూమ్‌కు బయట వైపు గడియపెట్టి , నిందితుడిని లోపలే బంధించారు. అనంతరం స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాత్రూమ్‌లో దాక్కున్న కౌన్సిలర్‌ను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కౌన్సిలర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు వివాదాల్లో చిక్కుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వారే ఇలాంటి అకృత్యాలకు పాల్పడటంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానిక మహిళా సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఆ కౌన్సిలర్ పదవిని వెంటనే రద్దు చేయాలని, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Frequently Asked Questions
జనగామ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఏమిటి?
ఈ ఘటనలో నిందితుడు ఎవరు?
స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ సంపత్ రాజ్ ఈ కేసులో నిందితుడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ దారుణం ఎక్కడ జరిగింది?
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన కౌన్సిలర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.
ట్రెండింగ్ వార్తలు























