Janagama: జనగామ జిల్లాలో 54 మంది హెడ్ మాస్టర్‌లకు ఝలక్, షోకాస్ నోటీసులిచ్చిన కలెక్టర్
Janagama News: జనగామ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులుగా ఉన్న 54 మందికి షో కాజ్ నోటీసులు జారీ అయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో ఈ నోటీసులు పంపారు.

Head Masters in Janagama: జనగాం జిల్లాలోని వివిధ పాఠశాలలో విద్యార్థుల హాజరు 25 శాతం కంటే తక్కువగా ఉన్నందుకు ఏకంగా 47 మంది ప్రధానోపాధ్యాయులకు షో కాజ్ నోటీసులు జారీచేశారు. జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రజ్వాన్ భాషా ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి తాజాగా ఈ షాకాజ్ నోటీసులు ఇచ్చారు. అంతటితో ఆగకుండా 60 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులకు CL లీవ్ లను శాంక్షన్ చేసినందుకు హెడ్ మాస్టర్ లను బాధ్యులుగా చేస్తూ ఏడుగురు హెడ్ మాస్టర్ లకు జనగామ జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 54 మంది హెచ్ఎంలకు జిల్లా విద్యా శాఖ అధికారి రాము షోకాస్ నోటీసులు జారీ చేశారు. షో కాజ్ నోటీసులు అందుకున్న వారిలో ప్రాథమిక, హై స్కూల్ హెడ్ మాస్టర్ లు ఉన్నారు.





















