Tenugu Patrika: తెలంగాణలో తొలి తెలుగు పత్రిక ‘తెనుగు పత్రిక’కు 100 ఏళ్లు పూర్తి, ఇనుగుర్తిలో శత జయంతి వేడుకలు
Telangana News | తెలంగాణలో తొలి తెలుగు పత్రిక తెనుగు పత్రిక వందేళ్లు పూర్తి చేసుకుంది. తెనుగు పత్రిక శత జయంతి వేడుకలను ఇనుగుర్తిలో ఘనంగా నిర్వహించనున్నారు.
Centenary celebrations of first Telugu daily Tenugu Patrika | వరంగల్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ప్రజల్లో స్వాతంత్రోద్యమ చైతన్యం నింపడం కోసం తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో తొలి పత్రికగా తెనుగు పత్రిక పుట్టింది. ఇద్దరు అన్నదమ్ములు జర్నలిస్టులుగా మారి తెనుగు పత్రిక ద్వారా తెలంగాణ ప్రజలను మేల్కొల్పేందుకు ప్రారంభించిన తెనుగు పత్రిక కు 2024 ఆగస్టు 27తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శతాబ్ది వేడుకలకు ఇనుగుర్తి సిద్ధమైంది.
మారుమూల గ్రామం నుంచి వెలువడిన తెనుగు పత్రిక
తెలంగాణలో నిజాం నిర్బంధ పాలనతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను బహిర్గతం చేయడంతో పాటు ప్రజలను చైతన్య పరచడం కోసం 1922లో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా మారుమూల ఇనుగుర్తి గ్రామంలో తెనుగు పత్రిక ప్రారంభమైంది. తెనుగు పత్రిక ప్రారంభం నాటికే తెలంగాణలో ఇంగ్లీష్ ఉర్దూ పత్రికలు వెలువడుతున్న నిజాం కు వ్యతిరేకంగా రాస్తే పరిస్థితి లేదు. దీంతో ఇనుగుర్తి గ్రామానికి చెందిన వద్దిరాజు సోదరులు సీతా రామచంద్ర రావు, రాఘవ రంగారావులు నిజాంకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్య నింపడం కోసం తెలుగు పత్రికను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి మచిలీపట్నం కేంద్రంగా కృష్ణ పత్రిక వెలువడేది కృష్ణ పత్రిక యాజమాన్యాన్ని వద్దిరాజు సోదరులు పత్రిక ప్రారంభోత్సవం నడపడానికి కావలసిన మేలుకువలను నేర్చుకున్నారు. ఇంకేముంది ఇనుగుర్తి గ్రామంలోని సొంత ఇంట్లో 1922 ఆగస్టు 27వ తేదీన తెనుగు దినపత్రిక పురుడు పోసుకుంది.
రజాకార్ల అరాచకం, స్వాతంత్రోద్యమం పత్రిక లక్ష్యం
నిజాం కు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమ పూర్తిని రగిలించడమే లక్ష్యంగా తెనుగు పత్రిక పనిచేయడం సాగింది. వద్దిరాజుల సోదరుల ఇంట్లోనే పత్రిక ముద్రణ అయ్యేది. వారానికి ఒకసారి తెనుగు పత్రిక వెలువడేది. నిజం పాలన లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలంగాణ రాజకీయ పరిస్థితులు స్వాతంత్రోద్యమ పూర్తి నింపే విధంగా పద్దిరాజు సోదరుల కలం నుండి వెలువడేవి. అయితే తెనుగు పత్రిక తెలంగాణ వ్యాప్తంగా వెళ్లాలంటే పోస్ట్ ఆఫీస్ ప్రధాన మార్గం. దీంతో వద్దిరాజు సోదరులు హైదరాబాదులోని పోస్టల్ శాఖతో చర్చలు జరిపి ఇనుగుర్తి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ లో ప్రారంభించేలా పాటుపడ్డారు. దీంతో పోస్ట్ ఆఫీస్ ప్రారంభం కావడంతో తెలుగు పత్రికను పోస్ట్ ద్వారా తెలంగాణ లోనే ప్రాంతాలకు పంపేవారు.
వద్దిరాజు సోదరులతో పాటు అప్పట్లో ప్రజలను చైతన్యప్రచడం కోసం పనిచేసే వారు తెనుగు పత్రిక కు వార్తలు రాశారు. తెనుగు పత్రిక తెలంగాణ ప్రజల్లో ఓవైపు నిజాం కు వ్యతిరేకంగా మరోవైపు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు దోహద పడింది. అప్పటికే అనేక పత్రికలపై నిర్బంధం ఉన్న వద్దిరాజు సోదరులు అవేమీ లెక్క చేయకుండా పత్రికను కొనసాగించారు. పత్రిక నడిచే చందాదారులు లేకపోవడంతో సొంత ఖర్చులతో పత్రికను నడిపారు. వారానికి 500 కాపీలు ఇనుగుర్తి కేంద్రంగా వెలువడేవి.
తెనుగు పత్రిక కార్యాలయంపై రజాకార్ల దాడి.
రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపుతున్న తెనుగు పత్రిక కార్యాలయం పై రజాకార్లు దాడి చేశారు. ఇనుగుర్తి లోని కార్యాలయంలో ఉన్న ముద్రణ యంత్రాలను, తెనుగు పత్రిక కాపీలను దగ్ధం చేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురైన వద్దిరాజు సోదరులు. అయినా తెనుగు పత్రికను కొనసాగించాలని లక్ష్యంతో వద్దిరాజు సోదరులు వరంగల్ కేంద్రంగా పత్రికను నడిపారు. కానీ అనేక ఇబ్బందులతో మద్దిరాజు సోదరులు పత్రికను నడపలేకపోయారు. దీంతో తెనుగు పత్రిక ఆగిపోయింది.
పత్రిక కార్యాలయం నేటికీ సజీవ సాక్ష్యం
అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పటి మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామంలో తెనుగు పత్రిక కార్యాలయం భవనం నేటికీ కనిపిస్తుంది. ఈ భవనం వద్దిరాజు సీతా రామచంద్ర రావు, రాఘవ రంగారావు సోదరులు సగృహం. శిథిలావస్థకు చేరిన రెండంతస్తుల భవనం సజీవ సాక్ష్యంగా నిలిచింది. తెలంగాణలో తొలి తెలుగు పత్రిక కార్యాలయం, ముద్రణ కేంద్రంగా కొనసాగిన భవాని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇనుగుర్తిలో శతాబ్ది వేడుకలు
ఇనుగుర్తి గ్రామంలో వద్దిరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 సంవత్సరాల వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 27వ తేదీన నిర్వహించే వేడుకలకు పత్రిక సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు.