అన్వేషించండి
Warangal News: వరంగల్ అభ్యర్థిని ఫిక్స్ చేసిన కేసీఆర్, రాజయ్యకు మళ్లీ బ్యాడ్ లక్!
Warangal Politics: పెండింగ్ లో ఉన్న వరంగల్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు.

డా. మారేపల్లి సుధీర్
Warangal BRS Candidate: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా, అధినేతతో కలిసిపనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు.
ఇంకా చదవండి





















