Vikarabad News: రాగి చెంబులో గోల్డ్ కొట్టేసిన దొంగ బాబాలు - స్వామీజీలను పట్టుకొని చితక్కొట్టిన స్థానికులు!
Vikarabad Swamijis News: పరిగి మండలం నస్కల్ గ్రామంలో దొంగ బాబాలను గ్రామస్తులు దేహశుద్ధి చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. వారు ఇంద్ర సినిమాలో మాదిరిగా మోసానికి పాల్పడ్డారు.
![Vikarabad News: రాగి చెంబులో గోల్డ్ కొట్టేసిన దొంగ బాబాలు - స్వామీజీలను పట్టుకొని చితక్కొట్టిన స్థానికులు! Vikarabad news Fake swamijis attempts to stole hotel owners gold ring in Parigi mandal Vikarabad News: రాగి చెంబులో గోల్డ్ కొట్టేసిన దొంగ బాబాలు - స్వామీజీలను పట్టుకొని చితక్కొట్టిన స్థానికులు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/11/58b45e18abce1514504534853b57ff011723358273919234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana News: వికారాబాద్ జిల్లాలో ఇంద్ర సినిమాలో తరహా మోసం జరిగింది. పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దొంగ సాధువులు భోజనం చేసి యజమానికి టోకరా వేశారు. నీవు సమస్యలో ఉన్నావని మంచి జరగాలంటే రాగి చెంబులో చేతికి ఉన్న బంగారం వేయని చెప్పగా యజమాని అలాగే చేశాడు. యజమానిని ఇంట్లోకి పంపించి, వచ్చేసరికి రాగి చెంబుకు తెల్లబట్ట చుట్టాడు. రేపు ఉదయం వరకు చెంబు తెరవద్దని తెలపడంతో అనుమానం వచ్చి యజమాని చెంబు తెరచి చూడగా అందులో రాయి ఉంది. మోసపోయానని గమనించి అరవడంతో చుట్టుప్రక్కల వారు దొంగ సాధువులను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఇటువంటి దొంగ బాబాలతో అప్రమత్తంగా ఉండాలని.. వారు జాగ్రత్తగా జనాల్ని నమ్మించి మోసం చేస్తారని పోలీసులు తెలిపారు. అమాయక ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తారని అన్నారు. ఎవరైనా సరే కొత్తవారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాత్రి అయిన పగలు అయినా కొత్త వేషధారలతో వస్తే వెంటనే పట్టుకొని పోలీసులకు అప్పజెప్పాలని సూచించారు. చాలా మంది కర్ణాటక మహారాష్ట్ర నుంచి బొలెరో కార్లలో వచ్చి అక్కడక్కడ తిరుగుతున్నారని స్థానికులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)