అన్వేషించండి

Telangana Congress : కేకే ఖాళీ చేసిన సీటుపై వీహెచ్ కన్ను - తనకే ఇవ్వాలంటూ డిమాండ్

VH Demand : కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు తనకే ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా తనకు ఎలాంటి పదవి లేదన్నారు.

VH demanded  Rajya Sabha :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదుల లొల్లి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మంత్రి పదవులు, పీసీసీ చీఫ్ స్థానాలను ఇప్పటి వరకూ భర్తీ చేయలేకపోయారు. తాజాగా  కాంగ్రెస్ లో చేరిన కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కోసం రేస్ ప్రారంభమయింది. ఆ స్థానం తనకే ఇవ్వాలని సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన..  లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ తనకు ఇస్తే గెలిచేవాడినని కానీ తనకు టిక్కెట్ విషయంలో అన్యాయం చేశారన్నారు.

ఎనిమిదేళ్లుగా పదవి లేదని వీహెచ్ ఆవేదన                                 

ఎనిమిదేళ్లుగా తనకు ఎలాంటి పదవీ లేదని ఆయినా  పార్టీ విజయానికి కృషి చేసానని తెలిపారు. త్వరలో రాజ్యసభకు జరగనున్న ఉపఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని పార్టీ హైకమాండ్ కు విజ్ఞప్తి చేసారు.  కేకే రాజీనామా చేయడం వల్ల ఒక్క రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు ఉపఎన్నికలు నిర్వహిస్తే ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అందుకే వీ హనుమంతరావు ముందుస్తుగానే గాంధీభవన్ లోనే ప్రెస్ మీట్ పెట్టి తన కోరికను వ్యక్తం చేశారు. 

కేకే ఖాళీ చేసింది కేకేకు ఇస్తారా .. ఇతరులకా     ?                      

అయితే తన రాజ్యసభ స్థానాన్ని మళ్లీ తనకు ఇచ్చే షరతుల మీదనే కేకే పార్టీ మారారాన్న ప్రచారం ఉంది. ఈ విషయంపై కాంగ్రెస్ వర్గాలు ధృవీకరించడం లేదు . కానీ పార్టీ మారగానే కేకే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఇంకా చెప్పాలంటే..ఆయన పార్టీలో చేరాల్సిన అవసరం కూడా లేదని అంటున్నారు. పార్టీ మారకుండానే పార్టీ నేతగా చెలామణి కావొచ్చు.. ఆయన కుమార్తె హైదరాబాద్  మేయర్ ఇప్పటికే పార్టీ మారిపోయారు. కానీ విలువలు కాపాడినట్లుగా ఉంటుందని అలాగే.. తన రాజ్యసభ సీటు తనకు వస్తుందన్న నమ్మకంతోనే కేకే రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. 

కేకేకు సలహాదారు పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డి                                  

కేకే అలా  రాజీనామా చేయగానే ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు సలహాదారు పదవి ఇచ్చారు. కేబినెట్ హోదా కూడా ఇచ్చారు. ఈ కారణంతో ఆయన కాళీ చేసిన రాజ్యసభ సీటు ఆయనకు ఇవ్వకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో  వీ హనుమంతరావు తన ప్రయత్నం తాను చేసుకోవడానికి తెర ముందుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఒకప్పుడు ఏఐసిసిలో ప్రముఖ నేతగా ఉన్న వీహెచ్ ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయారు. సీనియర్ నేతగా ఆయనకు గుర్తింపు ఇస్తున్నా.. పదవుల గురించి  మాత్రం ఆయన పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget