కేంద్రమంత్రులపై హరీష్‌ ఆగ్రహం- ఆరోపణలు తప్ప తెలంగాణకు చేసిందేంటని ప్రశ్న?

తెలంగాణలో రాజకీయం మాంచి రంజుగా నడుస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలతో వెదర్‌ను హీటెక్కిస్తున్నారు.

FOLLOW US: 

తెలంగాణ రాజకీయం వాడివేడిగా ఉంది. మాటకు మాట, సవాళ్లకు ప్రతి సవాళ్లతో నాయకులు ఇప్పుడే ఎన్నికల మూడ్ తీసుకొచ్చేస్తున్నారు.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అందుకు సిద్ధంగా ఉన్నామనేలా నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ చేసిన కామెంట్స్‌పై తెలంగాణ మంత్రి హరీష్‌ రావు ఘాటుగా స్పందించారు. 

పేరు గొప్ప.. ఊరు దిబ్బ

బీజేపీ నాయకులది పేరు గొప్పు.. ఊరు దిబ్బ అని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బీజేపీ నాయకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని ఆక్షేపించారు. కేంద్రమంత్రులు తెలంగాణ ప్రభుత్వంపై, టీఆర్ఎస్ నాయకులపై చేసిన విమర్శలను హరీశ్ రావు తిప్పికొట్టారు. ఎప్పుడు చూసినా.. తెలంగాణకు అవి ఇచ్చాం.. ఇవి ఇచ్చామని చెబుతున్న బీజేపీ నాయకులు.. భూములు కేటాయించిన ప్రాజెక్టులను ఇంత వరకు ఎందుకు కంప్లీట్ చెయ్యలేదని నిలదీశారు.

పని మాది.. పేరు మీదా?

మాటి మాటికి తెలంగాణకు ఆస్పత్రి ఇచ్చామని కిషన్ రెడ్డి చెబుతున్నారని.. దానికి 200 ఎకరాల భూమిని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చిందని హరీశ్ రావు వెల్లడించారు. నాలుగేళ్లు అవుతున్నా ఆ దవాఖానాలో ఇప్పటి దాకా ఒక్క శస్త్ర చికిత్స అయినా జరిగిందా అని ప్రశ్నించారు. ఒక్క శిశువుకైనా ప్రాణం పోశారా అని నిలదీశారు. ఏమీ చెయ్యని మీరు.. రాష్ట్రానికి ఎన్నో చేశామని చెబుతారా అని ప్రశ్నించారు. బీబీ నగర్ లోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో నడుస్తున్న సర్కారు దవాఖానాలో ఒక వెయ్యి 83 కాన్పులు జరిగాయని వెల్లడించారు హరీశ్ రావు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రుల్లో 61 శాతం ప్రసవాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని అన్నారు. 

రాజకీయ లబ్ధి కోసం బురద జల్లుతారా?

ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బంది 24 గంటలు కష్టపడుతున్నారని.. కానీ కిషన్ రెడ్డి వైద్యులను, వైద్య సిబ్బంది, స్వీపర్లను అవమానించేలా ఉస్మానియా ఆస్పత్రిపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం ఇతరులపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు హరీశ్ రావు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉచితాలు ఇవ్వవద్దని చెబుతున్నారని.. అంటే రాష్ట్రంలో నిరుపేదలకు ఉచితాలు ఇవ్వొద్దా అని హరీశ్ ప్రశ్నించారు. కార్పొరేటు కంపెనీలకు, బడా బాబులకు వేల కోట్ల రుణాలు మాత్రం మాఫీ చేస్తారు కానీ.. పేదలకు ఉచితాలు ఇవ్వవద్దని చెబుతున్నారా అని నిలదీశారు. 

అక్కడో మాట.. ఇక్కడో మాట

బీజేపీ నాయకులది రెండు నాల్కల ధోరణి అని హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని పార్లమెంటులో చెప్పి... ఎలాంటి అనుమతులు లేవని బయట చెబుతున్నారని మండిపడ్డారు. యాదాద్రి వేదికపై నుంచి బీజేపీ లీడర్లు చేసినవన్నీ తప్పుడు ఆరోపణలు అని హరీష్ తేల్చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోందని తెలిపారు. గర్భిణీలకు త్వరలో న్యూట్రిషన్ కిట్ అందివ్వనున్నట్లు ప్రకటించారు. అర్హులకు కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పారు.

Published at : 03 Aug 2022 07:19 PM (IST) Tags: harish rao Minister Harish Rao Latest News Minister Harish Rao Comments on BJP TRS And BJP War Verbal War between BJP And TRS

సంబంధిత కథనాలు

TS Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, నేడు, రేపు అతిభారీ వర్షాలు!

TS Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, నేడు, రేపు అతిభారీ వర్షాలు!

Breaking News Live Telugu Updates: కామన్ వెల్త్ గేమ్స్ బాక్సింగ్ లో నిఖత్ జరీన్ కు స్వర్ణం 

Breaking News Live Telugu Updates: కామన్ వెల్త్ గేమ్స్ బాక్సింగ్ లో నిఖత్ జరీన్ కు స్వర్ణం 

TS SI Preliminary Exam 2022: ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ రాత పరీక్ష, 91.32 శాతం మంది హాజరు!

TS SI Preliminary Exam 2022: ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ రాత పరీక్ష, 91.32 శాతం మంది హాజరు!

Minister Harish Rao: నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుంది, మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్

Minister Harish Rao: నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుంది, మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్

Dasoju Shravan: బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు!

Dasoju Shravan: బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు!

టాప్ స్టోరీస్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?