అన్వేషించండి

TSRTC: ఇక ఒరిజనల్ గుర్తింపు కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణం: ఆర్టీసీ ఎండి సజ్జనార్

Free Travel For women: ఒరిజనల్ గుర్తింపు కార్డు ఉంటేనే ఆడవారికి జీరో టికెట్ జారీ చేస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పష్టం చేశారు.

TSRTC MD Sajjanar: హైదరాబాద్: తెలంగాణలో మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం (Free Tavel For Women In Telangana) అందిస్తున్నారు. ఇక నుంచి (డిసెంబర్ 21 నుంచి) ఒరిజనల్ గుర్తింపు కార్డు ఉంటేనే ఆడవారికి జీరో టికెట్ జారీ చేస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ (Sajjanar) స్పష్టం చేశారు. తెలంగాణ (Telangana)లోని కొన్ని డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో సజ్జనార్ బుధవారం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాని (Free Bus For Women)కి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. అయితే మహాలక్ష్మీ పథకం నిబంధనలు కొందరు పాటించడం లేదన్నారు. కొందరు మహిళలు ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకు రావడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నా రని, స్మార్ట్ ఫోన్‌లలో సాఫ్ట్ కాపీలు చూపిస్తున్నారని గుర్తించినట్లు చెప్పారు. 

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరారు. స్మార్ట్ ఫోన్లలో ఐడీ ఫ్రూఫ్ చూపిస్తే ఉచిత ప్రయా ణానికి అనుమతి ఉండదని సజ్జనార్ స్పష్టం చేశారు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటో లు స్పష్టంగా కనిపించాలి. చాలా మంది ఆధార్ కార్డు ల్లో చిన్నతనం నాటి ఫొటోల్లా ఉన్నాయని... వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు

తెలంగాణ మహిళలకు మాత్రమే ఉచిత బస్ ప్రయాణం..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని సజ్జనార్ స్పష్టం చేశారు. అర్థం చేసుకుని చాలా చిత్తశుద్ధితో సమర్థ వంతంగా ఈ స్కీంను విజ యవంతంగా అమలు చేస్తో న్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిని ప్రశంసించారు. ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ మర్యాదపూ ర్వకంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

జీరో టికెట్ల విషయంలో కొందరు మహిళలు నిర్లక్ష్యం గా ఉండొద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలని కోరారు. జీరో టికెట్‌ను జారీ చేస్తేనే ఆ చార్జీని టీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువ గా ఉండే రూట్ బస్సుల్లో కొందరు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ముఖ్యంగా చివరి ట్రిప్పు బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణంతో పాటు వెనుక లాడర్ పైన ఎక్కి ప్రయాణిస్తున్నారని.. ప్రాణాలను పణంగా పెట్టి ఇలా ప్రయాణించడం సరికా దని, రద్దీ సమయాల్లో తమ సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులను కోరారు.

త్వరలో 2050 కొత్త బస్సులు 
ప్రయాణికుల రద్దీకి అను గుణంగా కొత్త బస్సు లను అందుబాటు లోకి తీసుకురావాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు సజ్జనార్ వెల్లడించారు. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులు అందు బాటులోకి వచ్చే ప్లాన్ చేస్తు న్నాం. అందులో 1050 డీజిల్ బస్సులు, 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. విడతల వారీగా ఆ బస్సులు వాడ కంలోకి వస్తాయని సజ్జనార్  తెలిపారు..

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget