By: ABP Desam | Updated at : 01 Nov 2021 05:22 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు. టీఎస్ఆర్టీసీ ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆర్టీసీ ఇమేజ్ పెంచడం, ఆదాయం సమకూర్చే పనిలో ఉన్నారు సజ్జనార్. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటే సజ్జనార్ తనదైన శైలిలో సమకాలీన అంశాలు ముడిపెడుతూ ట్వీట్లు చేస్తుంటారు. గత కొన్ని రోజులుగా డీజిల్, పెట్రోలు ధరలు వరసగా పెరుగుతున్నాయి. సామాన్యులకు పెట్రో ధరలు గుడిబండలా మారుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో ఆర్టీసీకి ఆదాయంగా మార్చేందుకు ఎండీ సజ్జనార్ ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ట్విట్టర్ వేదికగా సూపర్ స్టార్ మహేశ్ బాబు రంగంలోకి దింపారు. బైక్ పై మహేశ్ హైదరాబాద్ లో చక్కర్లు కొడుతున్నట్లు సజ్జనార్ ట్వీట్ చేశారు. ప్రిన్స్ మహేశ్ ఫొటోలకు క్యాప్షన్ జోడించి మీమ్స్ పెట్టారు.
Travel in #TSRTC Safely with less cost#sundayvibes @urstrulyMahesh @puvvada_ajay @Govardhan_MLA @RGVzoomin @DarshanDevaiahB @HUMTA_hmdagov @airnews_hyd @maheshbTOI @balaexpressTNIE @V6_Suresh @PranitaRavi @baraju_SuperHit @abntelugutv @AbhiramNetha @iAbhinayD @Telugu360 @TSRTCHQ pic.twitter.com/hvQVZytMNe
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 31, 2021
Also Read: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇక బస్సులు అలా కనిపించవు
ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కృషి
సూపర్ స్టార్ మహేశ్ ఫోటోలతో రూపొందించిన మీమ్స్ లో లీటరు పెట్రోలు కొట్టిస్తే సిటీ మొత్తం తిరగలేకపోవచ్చు కానీ అదే లీటరు పెట్రోలు కంటే తక్కువ ధరలో సిటీ మొత్తం తిరిగేందుకు ఆర్టీసీ అవకాశం కల్పిస్తుందని సజ్జనార్ అన్నారు. టీ24 టిక్కెట్టుతో 24 గంటల పాటు సిటీ మొత్తం తిరగవచ్చని స్పష్టం చేశారు. గతంలో ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా ఆర్టీసీ టికెట్లు రేట్లు పెంచి ప్రయాణికులపై భారం వేసేవారని, కానీ సజ్జనార్ అందుకు భిన్నంగా ఆలోచిస్తూ ఆర్టీసీ ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Also Read: ఆర్టీసీ బస్సులకి కూడా ‘అయ్యయ్యో వద్దమ్మా..’ ఈ టైంలో సజ్జనార్ ప్లాన్ మామూలుగా లేదుగా..!
An attempt to make bus depots more #commuter friendly. Milk feeding kiosk was set up at #MGBS bus station very soon same will be installed across other #busstands through out #Telangana@DrTamilisaiGuv @Govardhan_MLA @TSRTCHQ @Telugu360 @baraju_SuperHit #TSRTC #mondaythoughts pic.twitter.com/yyF5LuRCua
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 1, 2021
ఆర్టీసీ బస్టాండ్లలో మిల్క్ ఫీడింగ్ కియోస్క్ లు
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సజ్జనార్ శ్రమిస్తున్నారు. పండగ వేళల్లో స్పెషల్ సర్వీసుల పేరుతో ఆర్టీసీ అదనపు ఛార్జీల వడ్డనకు స్వస్థి పలికారు. సజ్జనార్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ఆర్టీసీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ ధరల దోపిడి నుంచి ప్రయాణికులకు ఉపశమనం లభించింది. టీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్లలో మిల్క్ ఫీడింగ్ కియోస్క్‌లు ఏర్పాటు చేయడంతో తల్లికి ఇచ్చిన గౌరవం అని ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసలు వస్తున్నాయి. ప్రయాణికులకు ఆర్టీసీపై మరింత నమ్మకం కలిగించేందుకు సజ్జనార్ కృషిచేస్తున్నారు. ఇప్పటికే మిల్క్ ఫీడింగ్ కియోస్క్ ఎంజీబీఎస్‌లో ప్రారంభమవ్వగా, మిగిలిన స్టేషన్లకు త్వరలో విస్తరించనున్నారు.
Also Read: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం
MLC Kavita On Congress : దేశంలో కాంగ్రెస్ ఓ తోక పార్టీ, ఎమ్మెల్యే కవిత ఘాటు వ్యాఖ్యలు
Breaking News Live Updates : ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం
Someshwara Temple: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే
Minister KTR UK Tour : పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ యూకే టూర్, కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు
Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్‌డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్
Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?