By: ABP Desam | Updated at : 26 Oct 2021 07:50 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
టీఎస్ఆర్టీసీ యూపీఐ పేమెంట్స్(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజల విజ్జప్తి మేరకు హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ/క్యూఆర్ కోడ్ ద్వారా పెమేంట్స్ చేసే సదుపాయాన్ని ప్రారంభించామని చెప్పారు. జూబ్లీ బస్ స్టేషన్ లో టికెట్ బుకింగ్ కౌంటర్, టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్, కార్గో సెంటర్ వద్ద యూపీఐ / క్యూ ఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరిస్తామని తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఇప్పటికే సికింద్రాబాద్ లోని రేతిఫైల్ బస్ స్టేషన్ లో, ఎంజీబీఎస్ లోని రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్, కార్గో సెంటర్ల వద్ద యూపీఐ/ క్యూఆర్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించామని వెల్లడించారు. యూపీఐ చెల్లింపులపై ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. దీంతో అన్ని బస్ స్టేషన్లలో యూపీఐ/ క్యూ ఆర్ పేమెంట్స్ చెల్లింపులు ప్రారంభిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
Also Read: ఆర్టీసీ బస్సులకి కూడా ‘అయ్యయ్యో వద్దమ్మా..’ ఈ టైంలో సజ్జనార్ ప్లాన్ మామూలుగా లేదుగా..!
లాభాల బాట పట్టించేందుకు సజ్జనార్ మార్క్
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థను లాభాల బాట పట్టించేందుకు సజ్జనార్ ప్రయత్నిస్తున్నారు. తనదైన మార్క్ తో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలపై ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు సంస్థను లాభాల్లో నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సజ్జనార్ నిర్ణయాలతో సంస్థ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ లలో వివిధ సేవలకు యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల సేవలను ఇటీవలే పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్‌పాస్ కౌంటర్లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. టీఎస్ఆర్టీసీ వృద్ధికి ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు, సలహాలు అడిగారు సజ్జనార్. యూపీఐ చెల్లింపులపై అభిప్రాయాలు, సూచనలను ట్విట్టర్ ద్వారా తెలియజేయాలన్నారు.
Also Read: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇక బస్సులు అలా కనిపించవు
ప్రయాణికుల నుంచి మంచి స్పందన
ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో జూబ్లీ బస్ స్టేషన్లోనూ యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపు సేవలను ప్రారంభించామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. పార్శిల్, కార్గో బుకింగ్, బస్ పాస్ కౌంటర్లలో ఈ సేవలను ప్రారంభించిన్నట్టు ప్రకటించారు. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ పైలెట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ సేవలు విస్తరించనున్నట్టు తెలిపారు.
Also Read: ప్రయాణికులకు గమనిక.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో నిర్ణయం.. కుదిరితే రాష్ట్రవ్యాప్తంగా..
KCR on BJP: మోదీ మాట్లాడటం ఆపి మా ప్రశ్నలకు జవాబు చెప్పండి :కేసీఆర్
ED Shock For TRS MP : టీఆర్ఎస్ ఎంపీకీ ఈడీ షాక్ - ఆస్తుల జప్తు ! కేసేమిటంటే
Minister Talasani Srinivas : మహారాష్ట్ర మోడల్ ఇక్కడ కుదరదు, ముందస్తుకు సై అంటే సై - మంత్రి తలసాని
Nizamabad News: 40 ఏళ్లకు మోక్షం- ఎస్సారెస్పీ కొత్త కళ వచ్చింది
Cyber Crime : మీరు సైబర్ మోసానికి గురయ్యారా? టైం వేస్ట్ చేయకుండా ఇలా చేయండి?
Netizens Reaction To VD Nude Poster: ఆ బొకే ఎవరికీ ఇవ్వకు బ్రో - విజయ్ దేవరకొండకు ప్యాంటు తొడిగిన నెటిజన్లు, శాలువా కప్పిన బాలకృష్ణ
Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత
Sleep With Lights: రాత్రివేళ లైట్స్ వేసుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు తప్పవు!
Stuart Broad 35 Runs Over: బ్రాడ్‌కి బాక్స్ బద్దలు - ఒకే ఓవర్లో 35 పరుగులు - ఈసారి కొట్టింది ఎవరో తెలుసా?