అన్వేషించండి

TSRTC MD Sajjanar: దాడికి గురైన టీఎస్ఆర్టీసీ సిబ్బందిని పరామర్శించిన ఎండీ సజ్జనార్, కఠిన చర్యలు అని వార్నింగ్!

TSRTC Driver Attacked: కొందరు దుండగుల చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరామర్శించారు. తార్నాకలోని టీఎస్ ఆర్టీసీ హాస్పిటల్ కు సజ్జనార్ వెళ్లారు.

RTC Staff Injured in attack: హైదరాబాద్: ఇటీవల కొందరు దుండగుల చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని బుధవారం సజ్జనార్ (VC Sajjanar) పరామర్శించారు. సిబ్బందిని ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కండక్టర్, డ్రైవర్ కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని సజ్జనర్ వారికి సజ్జనార్ భరోసా కల్పించారు. దాడిలో గాయాలైన కండక్టర్ రమేష్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

అసలేం జరిగిందంటే...
ఫరూక్ నగర్ డిపోనకు చెందిన 8ఏ రూట్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఫిబ్రవరి 4వ తేదీన ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. తమ తప్పు లేకున్నా బస్సును రోడ్డుపై ఆపి, నిందితులు క్రికెట్ బ్యాట్ తో వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్ కి గాయాలయ్యాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఇటీవల ఈ ఘటన జరిగింది.

TSRTC MD Sajjanar: దాడికి గురైన టీఎస్ఆర్టీసీ సిబ్బందిని పరామర్శించిన ఎండీ సజ్జనార్, కఠిన చర్యలు అని వార్నింగ్!
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ ప్రమాదంలో తమ సిబ్బంది ఎలాంటి తప్పులేదని, ఉద్దేశపూర్వకంగా సిబ్బందిపై దుండగులు దాడికి పాల్పడ్డారని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ దోమల్ గూడ పోలీసులు వెంటనే స్పందించారని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను సోమవారం అరెస్ట్ చేశారని తెలిపారు.

కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్
ప్రజలకు సేవలు అందిస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ సజ్జనార్ అల్లరిమూకలను హెచ్చరించారు. నిబద్దత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందిపై క్రికెట్‌ బ్యాట్‌ తో దాడి చేయడం బాధాకరం అన్నారు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని, కేసు హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఈడీలు కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఆస్పత్రి ఓఎస్డీ సైది రెడ్డి, తదితరులు ఉన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget