News
News
X

Madhuyashki: మోదీ వస్తుంటే టీఆర్ఎస్ నాటకాలు: మధుయాష్కీ

TS Politics: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మూసేసిందే బీజేపీ అని మధుయాష్కీ విమర్శించారు. ఇప్పుడేదో తామే బాగుచేసినట్లు ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు.

FOLLOW US: 

TS Politics: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అటు బీజేపీపై, ఇటు టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ విమర్శలు గుప్పించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసేసిందే బీజేపీ అని మధుయాష్కీ గుర్తు చేశారు. 2013 లో పది వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసి.. ఫ్యాక్టరీ తిరిగి తెరుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశేషమైన కృషి చేసిందని పేర్కొన్నారు. తమ కృషి వల్లే రామగుండం ఎరువుల కర్మాగారం బాగుపడినట్లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేసుకోవడాన్ని మధుయాష్కీ తీవ్రంగా తప్పుబట్టారు.

"మోదీ వస్తుంటే నాటకాలు"

ప్రధాని మోదీ వచ్చినప్పుడే టీఆర్ఎస్ గొడవ చేస్తుందని.. ఢిల్లీ వెళ్ళినప్పుడు మోదీ కాళ్ళ మీద పడి వస్తారని మధుయాష్కీ విమర్శలు గుప్పించారు. "ఇక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తుంటే నాటకాలు ఆడుతున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్, బీజేపీ పంచాయతీ. ఫోన్ ట్యాపింగ్ లో దొంగలే దొంగ అన్నట్టు ఉంది. గవర్నర్ కి అనుమానం ఉంటే కేంద్ర హోంశాఖ కి ఫిర్యాదు చేయాలి" అని మధుయాష్కీ అన్నారు. 

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా మధుయాష్కీ విమర్శలు గుప్పించారు. ఇటీవల గవర్నర్ తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేసిన అంశంపై మధుయాష్కీ మండిపడ్డారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అనుమానాలు ఉంటే కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయాలని మధుయాష్కీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుందన్నది నిజమేనని, ప్రతిపక్ష నాయకుల ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారని మధుయాష్కీ ఆరోపణలు చేశారు. 

News Reels

"తెలంగాణ లిక్కర్ పాలసీపై విచారణ జరగాలి"

ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై మధుయాష్కీ విమర్శలు గుప్పించారు. తెలంగాణ వస్తే దుబాయ్, బొగ్గుబాయి ఉండదని కేసీఆర్ చెప్పారని మధుయాష్కీ గుర్తు చేశారు. "ఎన్ఆర్ఐ శాఖ కూడా పెడతా అన్నారు. ఖతార్ లో వేల మంది కార్మికులను బయటకి పంపిస్తున్నారు. 25 వేల మందిని బయటకు పంపారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది. గల్ఫ్ కార్మికులకు రేషన్ కార్డ్ కూడా తీసేసింది. ఈ ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ వెంటనే అమలు చేయాలి. కేంద్రం కూడా ఎన్ఆర్ఐ శాఖ తీసేసింది. ఖతార్ నుంచి వచ్చే కార్మికులకు పని కల్పించాలి. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పి.. ఇప్పటి వరకు నియామకాలు లేవు. తెలంగాణ లిక్కర్ పాలసీ పంజాబ్, ఢిల్లీ పాలసీ నే కాపీ కొట్టింది. తెలంగాణ లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణ జరగాలి. బేవరేజ్ కూడా వాళ్లకు సంబంధించిన వాళ్ళకే కట్టబెట్టారు. అత్యధిక లిక్కర్ సేల్ తెలంగాణలోనే జరుగుతున్నాయి. డ్రగ్స్ అమ్మకాల్లో తెలంగాణ టాప్ లో ఉంది. డ్రగ్స్ ఎపిసోడ్ ఏమైందో అర్థం కాలేదు"అని మధుయాష్కీ విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రతి ఎన్నికను సీరియస్ గానే తీసుకుంటుందని ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ పేర్కొన్నారు. "ఉప ఎన్నికలో అందరూ కలిసి పని చేశారు. కాంగ్రెస్ పార్టీ కంటిన్యూగా ఓడిపోవడం విచారకరం. తెలంగాణలో ప్రజల మద్దతు ఎందుకు రావడం లేదు అనే దానిపై సమీక్ష చేయాలి. ధన ప్రభావం ఒక్కటే ఉండదు. ప్రియాంక గాంధీ త్వరలోనే తెలంగాణ బాధ్యతలు తీసుకుంటారు. త్వరలోనే సమీక్ష జరుగుతుంది. సమీక్షలే కాదు దిద్దుబాటు చర్యలూ ఉంటాయి. రాహుల్ గాంధీ జోడో యాత్రలో నాయకుల ఐక్యత కనపడింది. ఇది మంచి పరిణామం. కమ్యూనిస్టులు మాతో ఉండేవాళ్లు.. ఇప్పుడు లేరు" అంటూ మధుయాష్కీ చెప్పుకొచ్చారు.

Published at : 11 Nov 2022 06:20 PM (IST) Tags: Telangana Politics TS Politics Madhuyaski Madhu Yaski Gouds Fires TRS Congress Leader Madhu Yaski

సంబంధిత కథనాలు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

వైఎస్‌ఆర్‌టీపీకి మంచి రోజులు వస్తాయా? షర్మిల అరెస్టు, దాడులతో మైలేజీ పెరిగిందా?

వైఎస్‌ఆర్‌టీపీకి మంచి రోజులు వస్తాయా? షర్మిల అరెస్టు, దాడులతో మైలేజీ పెరిగిందా?

Breaking News Live Telugu Updates: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

Breaking News Live Telugu Updates: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్-కేసీఆర్ ఒక తాలిబన్: షర్మిల

ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్-కేసీఆర్ ఒక తాలిబన్: షర్మిల

KTR Tweet: ఇక ఆ ఛానెల్ చూడను, అన్‌ఫాలో చేసేస్తున్నా - ఆ వార్తలకు థ్యాంక్స్: కేటీఆర్

KTR Tweet: ఇక ఆ ఛానెల్ చూడను, అన్‌ఫాలో చేసేస్తున్నా - ఆ వార్తలకు థ్యాంక్స్: కేటీఆర్

టాప్ స్టోరీస్

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'