TS Inter 1st Year Results 2024: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ విడుదల, జిల్లాల్లో రంగారెడ్డి టాప్, అట్టడుగున కామారెడ్డి
Telangana Inter 1st Year Results 2024: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ రెగ్యూలర్, ఒకేషనల్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Telangana Inter Results 2024 link download: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ముందుగా చెప్పినట్లుగానే ఏప్రిల్ 24న ఇంటర్ ఫలితాలు విడుదల చేసింది ఇంటర్ బోర్డ్. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ రెగ్యూలర్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులతో పాటు ఫస్టియర్ ఒకేషనల్ కోర్సుల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.
ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి
బాలికలదే పైచేయి..
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ లో 2,62,829 మంది రెగ్యూలర్ విద్యార్థులు పాస్ కాగా, ఒకేషనల్ విద్యార్థులు 24,432 మంది ఉత్తీర్ణత సాధించారు. ఓవరాల్ గా ఇంటర్ ఫస్టియర్ లో 2,87,261 మంది పాసయ్యారు. ఇంటర్ ఫస్టియర్ లో మొత్తం 61.06 శాతం పాస్ కాగా, వీరిలో బాలికలు 1,49,331 మంది ఉండగా, బాలురు 1,13,498 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 68.59 శాతం పాస్ కాగా, బాలురు 53.36 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 48 మంది రెగ్యూలర్ విద్యార్థులు, ఇద్దరు ఒకేషనల్ విద్యార్థులలు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు వెల్లడించారు.
జిల్లాల వారీగా పాస్ పర్సెంటేజ్...
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71.7 శాతంతో అగ్ర స్థానంలో ఉండగా, 34.81 శాతంతో కామారెడ్డి అట్టడుగున నిలిచింది.
రంగారెడ్డి 71.7 శాతం
మేడ్చల్ 71.58 శాతం
ములుగు 70.01 శాతం
ఖమ్మం 63.84
కరీంనగర్ 63.41
హన్మకొండ 62.41
హైదరాబాద్1 62.14
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 61.55 శాతం
ఆదిలాబాద్ 61.05 శాతం
హైదరాబాద్ 2 59.06 శాతం
జయశంకర్ భూపాళపల్లి 58.61 శాతం
హైదరాబాద్ 3 58.52 శాతం
రాజన్న సిరిసిల్ల 57.79 శాతం
నల్గొండ 57.2 శాతం
భద్రాద్రి కొత్తగూడెం 56.39 శాతం
నిర్మల్ 56.05 శాతం
మహబూబాబాద్ 55.72 శాతం
సంగారెడ్డి 55.29 శాతం
జనగామ 55.18 శాతం
మహబూబ్ నగర్ 53.94 శాతం
జోగులాంబ గద్వాల్ 53.48 శాతం
వికారాబాద్ 53.11 శాతం
వనపర్తి 52.78 శాతం
వరంగల్ 51.94 శాతం
జగిత్యాల 51.69 శాతం
యాదాద్రి 51.04 శాతం
నిజామాబాద్ 49.95 శాతం
సూర్యాపేట 49.42 శాతం
సిద్దిపేట 48.77 శాతం
మెదక్ 47.18 శాతం
పెద్దపల్లి 46.31 శాతం
మంచిర్యాల 46.29 శాతం
నారాయణపేట 44.3 శాతం
కామారెడ్డి 34.81 శాతం
ఈ ఏడాది మొత్తం 9,80,978 మంది విద్యార్థులు తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 48,277 మంది ఎగ్జామ్ రాశారు. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు వెల్లడించారు.
టీఎస్ ఇంటర్ బోర్డ్ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు పూర్తికాకముందే, మార్చి 10న వాల్యుయేషన్ ప్రారంభించి ఏప్రిల్ 10 తేదీలోపు పూర్తిచేశారు. దాదాపు 5 వారాల తరువాత ఇంటర్ ఫలితాలు నేడు (ఏప్రిల్ 24న) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డ్ వెబ్‌సైట్ తో పాటు ఏబీపీ దేశం వెబ్ సైట్‌లో ఇంటర్ విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. మరో వారం రోజుల్లో తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్