KTR Birthday Preparations : కేటీఆర్‌కు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ - సోషల్ మీడియాలో టీఆర్ఎస్ నేతల రచ్చ షురూ !
కేటీఆర్‌కు ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు.
KTR Birthday Preparations : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బర్త్ డే జూలై 24వ తేదీన జరగనుంది. ఇంకా రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ టీఆర్ఎస్ నేతల్లో సందడి కనిపిస్తోంది. కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయనకు భిన్నంగా శుభాకాంక్షలు చెప్పేందుకు ఎవరికి వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చే వెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రెండు రోజుల ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెప్పి... ఓ వీడియోను ట్వీట్ చేశారు.
Wishing an epitome of commitment and integrity, an uplifting spirit, and a source of great inspiration for the younger generations, Hon'ble Minister Shri @KTRTRS Garu a Very Happy Birthday in advance.#HappyBirthdayKTR pic.twitter.com/8pOy1jxRwD
— Dr Ranjith Reddy - TRS (@DrRanjithReddy) July 22, 2022
నిబద్ధత, చిత్తశుద్ధికి ప్రతిరూపం.. యువతరానికి కేటీఆర్ గొప్ప స్ఫూర్తి. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని కూడా సమయానుగుణంగా కొట్టగలడు. అద్భుతమైన ఐడియాలను సృష్టిస్తాడు. అందరితో అనుబంధాలను పంచుకుంటాడు. ఐడియాలను ప్రచారం చేస్తాడు. కుటుంబం కోసం నిలబడుతాడు. అలాంటి అద్భుతమైన వ్యక్తి కేటీఆర్‌కు సెల్యూట్....అని ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో టీఆర్ఎస్ నేతల్ని ఆకట్టుకుంది. కార్యకర్తలు కూడా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.. కేటీఆర్‌ను కూడా ఆకట్టుకుంది. ఈ వీడియోను రీ ట్వీట్ చేస్తూ ఎంపీ రంజిత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Many thanks 🙏 Ranjit Anna https://t.co/sFrMceI6Zg
— KTR (@KTRTRS) July 22, 2022
పలువురు టీఆర్ఎస్ నేతలు రంజిత్ రెడ్డి వీడియోను రీ ట్వీట్ చేసి కేటీఆర్‌కు అడ్వాన్స్ విషెష్ చెబుతున్నారు.. ఈ సారి కేటీఆర్ పుట్టిన రోజు ఆదివారం వచ్చింది. ఆ రోజున భారీ ఎత్తున సేేవా కార్యక్రమాలు నిర్వహించడానికి టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రతీ ఏడాది కేటీఆర్ నిరాడంబరంగా పుట్టిన రోజు చేసుకుంటారు. అయితే టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూంటారు. పార్టీ నేతలు... గత పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అంబులెన్స్‌లు లాంటి వివరాళాలుగా ఆస్పత్రులకు ఇచ్చారు.