అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Students Protest: మంచినీటి కోసం రోడ్డెక్కి, వర్షంలో తడుస్తూనే విద్యార్థినుల ఆందోళన!

Students Protest: తాగేందుకు మంచి నీళ్లు లేవని అలాగే తినే అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయంటూ ట్రెబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థినిలు వర్షంలో తడుస్తూనే రోడ్డుపై ధర్నా చేశారు.

Students Protest: నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో తాగేందుకు మంచి నీళ్ళు రావడం లేదని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తాగేందుకు మంచినీళ్లు లేకపోవడమే కాకుండా తినే అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని... ఇలాంటి పురుగుల అన్నం తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని వెల్లడించారు. బియ్యం సరిగ్గా లేకపోతే కనీసం రీపాలిష్ కూడా చేయించట్లేరని తెలిపారు. 

వర్షంలోనే విద్యార్థినుల ధర్నా..

తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నామని అధికారులకు చెప్పినా ఎలాంటి ఫలితం లేదని విద్యార్థినులు వాపోయారు. విద్యార్థినిలు ఎన్ని అవస్థలు పడుతున్నా అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రోడ్డుపై బాలికలు ధర్నా చేస్తున్నారు. నీళ్లు లేకుండా ఎన్ని రోజులు గడపాలంటూ ప్రశ్నించారు. భైంసా - నిజామాబాద్ రోడ్డుపై బైఠాయించి తమకు నాణ్యమైన భోజనం, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరసనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 

పిల్లలు చెప్పేది నిజమే.. కానీ

పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ మాట్లాడుతూ..  పిల్లలు చెప్పేది వాస్తవమే.. మోటార్ పాడవ్వడంతో మంచి నీటి సమస్య ఏర్పడిందని తెలిపారు. అయితే వర్షం కారణంగా సమస్యను పరిష్కరించలేకపోయామని.. సమస్యలు తీరుస్తామని చెప్పారు. అయినా సరే పిల్లలు ధర్నా ఆపకపోవడంతో స్థానిక సర్పంచ్ రాజేందర్ కు ఫోన్ చేయగా... గ్రామ పంచాయతీ నీటి ట్యాంకర్ ద్వారా నీళ్లు పంపిచారని చెప్పారు. ఈరోజు సాయంత్ర నాలుగు గంటల లోపు కచ్చితంగా మోటర్ బాగు చేయించి.. పిల్లలకు మంచి నీళ్లు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడి హామీతో విద్యార్థినులు నిరసనను విరమించారు. 

నీళ్లే కాదు నాణ్యమైన భోజనం కూడా కావాలి..

సమస్య రాగానే అధికారులు స్పందించి సమస్యలు తీరిస్తే బాగుంటుందని విద్యార్థినులు చెప్పారు. చిన్న పిల్లలు ఇలా వర్షంలో రోడ్డెక్కే పరిస్థితి రావడానికి పాఠశాల అధికారులే కారణమని తెలిపారు. కేవలం మంచినీళ్లు అందిస్తే సరిపోదని.. నాణ్యమైన భోజనం కూడా పెట్టాలని కోరారు. ప్రస్తుతం తినే అన్నం సరిగ్గా లేదని.. చాలా సార్లు పురుగులు వస్తున్నాయని మరోసారి తెలిపారు. ఆ సమస్య కూడా తీరిస్తేనే తాము ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోగలమని వివరించారు. పిల్లలు అడగకముందే వారి సమస్యలు అడిగి తెల్సుకుంటే బాగుంటుందని సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
TRS Kavitha Comments On Vijay TVK: టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
Bandi Sanjay on Election Results: విభజన రాజకీయాలు చేసిన రేవంత్, స్టాలిన్‌లకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు: బండి సంజయ్
విభజన రాజకీయాలు చేసిన రేవంత్, స్టాలిన్‌లకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు: బండి సంజయ్
Kalvakuntla Family Politics: కేసీఆర్‌పై రాజకీయంగానే కవిత విమర్శలు - కానీ కుటుంబ సంబంధాలకూ గండం - కల్వకుంట్ల ఫ్యామిలీ చీలిపోయినట్లేనా?
కేసీఆర్‌పై రాజకీయంగానే కవిత విమర్శలు - కానీ కుటుంబ సంబంధాలకూ గండం - కల్వకుంట్ల ఫ్యామిలీ చీలిపోయినట్లేనా?

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Results 2026: మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
Mamata Banerjee: మమత బెనర్జీకి బిగ్‌షాక్‌! కంచుకోటలో మరోసారి ఓటమి! కేంద్ర బలగాలపై టీఎంసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
మమత బెనర్జీకి బిగ్‌షాక్‌! కంచుకోటలో మరోసారి ఓటమి! కేంద్ర బలగాలపై టీఎంసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
TRS Kavitha Comments On Vijay TVK: టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
Vijay Networth: టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!
పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!
Trisha Political Entry: రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!
రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!
Bengal Assembly Election Results: మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు
మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు
Embed widget