Top Headlines Today: కులగణనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్- 9 స్థానాల్లో పోటీ చేయనున్న ఎంఐఎం
Top 5 Telugu Headlines Today 3 November 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 3 November 2023:
కులగణనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ - జర్నలిస్టులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ శుక్రవారం జరిగింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించి మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. మొత్తం 38 ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ఏపీలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు, 6790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై షరతులు - హైకోర్టు కీలక తీర్పు
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ లో మరికొన్ని అదనపు షరతుల విషయంలో సీఐడీ అనుబంధ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ ర్యాలీలో పాల్గొనొద్దని, కేసు అంశాలపై మీడియాతో మాట్లాడొద్దని, గతంలో ఇచ్చిన ఆదేశాలనే కొనసాగించాలని స్పష్టం చేసింది. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. కాగా, స్కిల్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్టీపీ దూరం - కాంగ్రెస్ కు బయటి నుంచి మద్దతు ఉంటుందన్న షర్మిల
తెలంగాణ ఎన్నికల్లో పోటీపై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. బయటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలనే ఉద్దేశం మాకు లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఓట్లు చీలకూడదని, కేసీఆర్ ను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగింది. ప్రభుత్వం మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడడం సరికాదు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మా మద్దతు ఉంటుంది. మేం పోటీ చేయడం లేదు.' అంటూ షర్మిల స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
9 స్థానాల్లో పోటీ చేయనున్న ఎంఐఎం, పార్టీ చీఫ్ అసదుద్దీన్ కీలక ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 9 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం వెల్లడించారు. గతంలో తరహాలోనే తమ కంచుకోట అయిన చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, చార్మినార్, బహుదూర్‌పురా, కార్వాన్, నాంపల్లి, మలక్ పేట స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనుంది. వీటితో పాటు కొత్తగా జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో సైతం పోటీ చేస్తామని అసదుద్దీన్ కీలక ప్రకటన చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్లానింగ్, డిజైన్, నాసిరకం నిర్మాణం వల్లే కుంగిన మేడిగడ్డ - కేంద్ర కమిటీ నివేదికలో కీలక విషయాలు
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ కీలక నివేదిక ఇచ్చింది. పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడంవల్లే కుంగిపోయిందని ఆ నివేదికలో పేర్కొంది. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత, సామర్థ్యం తక్కువగా ఉందని కమిటీ తెలిపింది. బ్యారేజ్ లోడు వల్ల ఎక్కువగా ఎగువన ఉన్న కాంక్రిట్ కూడా తొలగిపోయిందని, బ్యారేజ్‌ను పునరుద్దరించే వరకు చేపట్టాల్సిన చర్యలు కూడా కమిటీ సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి