By: ABP Desam | Updated at : 27 Aug 2023 03:02 PM (IST)
ఏపీ, తెలంగాణ టాప్ హెడ్ లైన్స్
ఏ మూల చూసినా టీడీపీనే - ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు పక్కా వ్యూహం !
అధికారంలో ఉంటే అధికార బాధ్యతలతో తీరిక లేకుండా ఉంటారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. పార్టీని పట్టించుకోరు. అదే అధికారం లేకపోతే పూర్తి సమయం పార్టీ కోసం కేటాయిస్తారు. ఆయన రాజకీయ వ్యూహాల గురించి ఎవరికీ డౌట్స్ ఉండవు. ఘోర పరాజయం ఎదురైనా.. ఏ మాత్రం ఆత్మవిశ్వాసం తగ్గించుకోలేదు. మొదటగా నడక ప్రారంభించారు. తర్వాత జాగింగ్ చేశారు. ఇప్పుడు పరుగు అందకుంటున్నారు. ఎన్నికలకు ఆరేడు నెలల ముందే ఏపీలో ఎటు వైపు చూసినా తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపించేలా ప్లాన్ చేసుకున్నారు. మినీ మేనిపెస్టోను ప్రకటించి.. పార్టీ నేతలందర్నీ ఇంటింటికి పంపుతున్నారు. పూర్తి వివరాలు
ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డిక్లరేషన్లు పెట్టండి - హరీశ్ రావు డిమాండ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై అధికార పార్టీ నుంచి విమర్శలు మొదలు అయ్యాయి. ముందు కర్ణాటకలో డిక్లరేషన్ చేసి తర్వాత ఇక్కడ ప్రకటించాలని మంత్రి హరీశ్ రావు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, అక్కడ వెయ్యి మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. పూర్తి వివరాలు
పేరుకు మాత్రం ఏపీ తెలుగు భాషాభివృద్ధి సంస్థ, లోపల దిమ్మతిరిగే తప్పులు - విపరీతంగా ట్రోలింగ్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకు చెందినదిగా వైరల్ అవుతున్న ఓ లేఖ సోషల్ మీడియా విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. అయితే, ఆ లేఖ కచ్చితంగా తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ విడుదల చేసిన లేఖ అనే దానిపై స్పష్టత లేదు. కానీ, అందులోని అక్షర దోషాలు విపరీతంగా ఉన్నాయి. కనీసం ఒక్కో లైనుకు ఒక్కో తప్పు చొప్పున ఆ లేఖలో ఉన్నాయి. తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రదానం చేయబోయే పురస్కారం కోసం ఆ సంస్థే విడుదల చేసిన ఓ ఉత్తర్వులో అన్ని తప్పులు ఉండడం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. పూర్తి వివరాలు
119 నియోజకవర్గాలు 1000 అప్లికేషన్లు, కాంగ్రెస్‌కు పెద్ద పరీక్షే, ఆ 881 మంది గమ్మునుంటారా?
కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తీవ్రంగా పోటీ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ టికెట్ల కోసం దరఖాస్తులు సమర్పించారు. కొందరు స్వయంగా వెళ్లి దరఖాస్తులు సమర్పిస్తే మరికొందరు తమ అనుచరుల ద్వారా గాంధీభవన్ లో అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు ఇల్లెందు నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు ఆశావహులు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మూడు నియోజకవర్గాలకు దరఖాస్తు పెట్టారు. తన ఆశావాహులు అందరితో దరఖాస్తులను పెట్టించారు. ఇలా చాలా మంది నేతలు రెండు మూడు నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీలు అసెంబ్లీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు
కేసీఆర్ సార్‌కే ఓటెస్తం - కామారెడ్డి జిల్లాలో 9 పంచాయతీల్లో తీర్మానం
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన సమయంలో సీఎం కేసీఆర్ తాను గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్‌ఎస్‌ను బలపరిచేందుకు ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. కేసీఆర్ గెలుపు చారిత్రాత్మకంగా ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగా ఏకంగా పంచాయతీలకు పంచాయతీలే ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!
TSPSC: 'గ్రూప్-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ
Rain In Hyderabad: హైదరాబాద్‌లో వర్షం - చిరుజల్లుల మధ్యే కొనసాగుతున్న నిమజ్జనం
Minister Dance: గణేశ్ శోభాయాత్రలో డాన్స్ చేసిన మంత్రి, ఆయనతో కలెక్టర్, ఎస్పీ కూడా
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
/body>