Top Headlines Today: చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి! త్వరలో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ
Top 5 Telugu Headlines Today 18 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Top 5 Telugu Headlines Today 18 September 2023:
చంద్రబాబును కలిసిన నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుటుంబసభ్యులు కలిశారు. సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. 45 నిమిషాల పాటు చంద్రబాబుతో... భువనేశ్వరి, బ్రాహ్మాణి మాట్లాడనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ, ఏపీ ప్రభుత్వం ఏ37గా చంద్రబాబు పేరును చేర్చింది. సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టడంతో, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పూర్తి వివరాలు
పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రస్తావన- కాంగ్రెస్‌పై మోదీ సెటైర్లు
75 ఏళ్లుగా దేశానికి సేవలు అందిస్తున్న పార్లమెంట్ భవనం గురించి మాట్లాడిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజన నాటి పరిస్థితులు వివరించారు. అంతక ముందు చాలా రాష్ట్రాల విభజన జరిగిందని వివరించారు. అలా జరిగిన టైంలో రెండు రాష్ట్రాల్లోని ప్రజలంతా హ్యాపీగా సంబరాలు చేసుకున్నారని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన టైంలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించలేదని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు
తెలంగాణకు రాబోతున్న ప్రధాని మోదీ, ముహూర్తం ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని రాష్ట్రానికి రాబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2, 3, 4వ తేదీల్లో ఏదో ఒకరోజు ఈ పర్యటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రారంభోత్సవంతోపాటు నిజామాబాద్‌లో రోడ్ షో నిర్వహించాలని బీజేపీ అధికార నేతలు నిర్ణయించారట. అలాగే మహబూబ్ నగర్ లేదా నిజామాబాద్‌లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. పూర్తి వివరాలు
ఎయిర్ పోర్టు మార్గంలో 31 కి.మీ రూట్ మ్యాప్ సిద్ధం, నెలాఖరుకు నిర్మాణ సంస్థ ఖరారు
ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. విమానాశ్రయంతో నగరానికి మెట్రో అనుసంధానం ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు మెట్రో అధికారులు పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఐటీ కారిడార్ లోని రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి మొదలై శంషాబాద్ ఎయిర్ పోర్టు లోపలి వరకు పనులు కొనసాగనున్నాయి. ఈ మెట్రో మార్గం దాదాపు 31 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఈ మార్గం ఔటర్ రింగ్ రోడ్డు లోపలి నుంచి నిర్మించేలా మెట్రో అధికారులు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఈ మార్గంలో మెట్రో నిర్మాణం చేపట్టేందుకు పిల్లర్ల నిర్మాణానికి వీలుగా రైట్ ఆఫ్ వేను సిద్ధం చేస్తున్నారు. పూర్తి వివరాలు
ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన వరకు - పాత పార్లమెంట్ భవనంతో ప్రత్యేక అనుబంధం
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ... పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై చర్చ జరుగుతోంది. రేపటి నుంచి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పాత భవనంతో ఉన్న జ్ఞాపకాలను మోడీ గుర్తుచేసుకున్నారు. ఈ చారిత్రక భవనం నుంచి మనం వీడ్కోలు తీసుకుంటున్నామని, స్వాతంత్రానికి పూర్వం ఈ భవనం ఇంపీరియల్ లెజిస్లేచర్ కౌన్సిల్‌గా ఉండేదన్నారు. ఈ భవనం చారిత్రక ఘట్టాలకు వేదికైందని, అనేక కొత్త రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాలు ఈ భవనంలోనే జరిగాయన్నారు మోడీ. పూర్తి వివరాలు





















