అన్వేషించండి

Airport Metro: ఎయిర్ పోర్టు మార్గంలో 31 కి.మీ రూట్ మ్యాప్ సిద్ధం, నెలాఖరుకు నిర్మాణ సంస్థ ఖరారు

Airport Metro: రాయదుర్గం నుంచి ఓఆర్ఆర్ వెంట మెట్రో మర్గాన్ని మెట్రో అధికారులు సిద్ధం చేశారు. ప్రభుత్వం నెలాఖరుకు నిర్మాణ సంస్థను ఖరారు చేయనుంది.

Airport Metro: ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. విమానాశ్రయంతో నగరానికి మెట్రో అనుసంధానం ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు మెట్రో అధికారులు పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఐటీ కారిడార్ లోని రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి మొదలై శంషాబాద్ ఎయిర్ పోర్టు లోపలి వరకు పనులు కొనసాగనున్నాయి. ఈ మెట్రో మార్గం దాదాపు 31 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఈ మార్గం ఔటర్ రింగ్ రోడ్డు లోపలి నుంచి నిర్మించేలా మెట్రో అధికారులు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఈ మార్గంలో మెట్రో నిర్మాణం చేపట్టేందుకు పిల్లర్ల నిర్మాణానికి వీలుగా రైట్ ఆఫ్ వేను సిద్ధం చేస్తున్నారు. 

విమానాశ్రయ మెట్రో పనులను ప్రారంభించడం, సైక్లింగ్‌ ట్రాక్‌ ప్రారంభోత్సవం కార్యక్రమాలు ఈ నెలలోనే ఉండనున్నాయి. విమానాశ్రయ మెట్రో రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ. పనులకు గతేడాది డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ పద్ధతిలో గ్లోబల్‌ టెండర్లను పిలిచారు. రెండు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ఎల్‌1గా నిలిచిన సంస్థ వివరాలతో ప్రభుత్వానికి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) నివేదిక సమర్పించింది.

ప్రభుత్వ ఆమోదం తరువాత సంస్థ పేరు వెల్లడి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో పనులకు నెలన్నర క్రితమే టెండర్‌ ప్రక్రియ ముగిసింది. రెండు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎల్‌1గా నిలిచిన సంస్థను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపినట్లు అధికారులు చెబుతున్నారు. సర్కార్ నుంచి ఆమోదం వచ్చిన వెంటనే సదరు సంస్థ అనంతరం విమానాశ్రయ మెట్రో పనులను చేడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌ అయినప్పటికీ కేంద్రం నుంచి కూడా సూత్రప్రాయ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది.

మెట్రో డిపో కోసం 48 ఎకరాలు

విమానాశ్రయంలో ఎక్స్‌ప్రెస్‌ మెట్రో డిపోను నిర్మించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  ఇందుకోసం అవసరమైన 48 ఎకరాలను మెట్రోరైలు సంస్థకు అప్పగించాలని మంత్రి కేటీఆర్ గత నెలలో జీఎంఆర్‌ను ఆదేశించారు. ఈ మేరకు జీఎంఆర్‌ సంస్థ ఇటీవలనే ఆ భూమిని మెట్రోకి అప్పగించింది. దీంతో అధికారులు మెట్రో పనులపై కసరత్తు చేస్తున్నారు. డిపో డిజైన్‌ రూపొందించే పనిలో పడ్డారు. మెట్రో ప్రాజెక్ట్‌ దక్కించుకున్న సంస్థ డిజైన్ ప్రకారం నిర్మాణం చేపట్టనుంది.

హైదరాబాద్ ఐటీ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతోంది. ఈ క్రమంలో భారీ నిర్మాణాలు వెలిశాయి. రవాణా మార్గాలు ఉన్నాయి. అయితే ఎయిర్ పోర్ట్‌కు వెళ్లడానికి సరైన రవాణా లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. భవిష్యత్తులో ఈ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో లైన్ తప్పనిసరి అని సీఎం కేసీఆర్ భావించారు. విమానాశ్రయంతో నగరానికి మెట్రో అనుసంధానం చేయాలోచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget