News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Modi Telangana Tour: తెలంగాణకు రాబోతున్న ప్రధాని మోదీ, ముహూర్తం ఎప్పుడంటే?

Modi Telangana Tour: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రాబోతున్నారు. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్రంలో పర్యటించబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 

FOLLOW US: 
Share:

Modi Telangana Tour: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని రాష్ట్రానికి రాబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2, 3, 4వ తేదీల్లో ఏదో ఒకరోజు ఈ పర్యటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రారంభోత్సవంతోపాటు నిజామాబాద్‌లో రోడ్ షో నిర్వహించాలని బీజేపీ అధికార నేతలు నిర్ణయించారట. అలాగే మహబూబ్ నగర్ లేదా నిజామాబాద్‌లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారట.

ఆదివారం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణకు విముక్తి కలిగించేందుకు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, వాళ్లను స్మరించుకోవాల్సిన సందర్భమిదే అన్నారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సర్దాల్ పటేల్ లేకపోతే... ఈ విమోచన సాధ్యమయ్యేది కాదని తేల్చి చెప్పారు. రజాకార్ల పోరాడి అమరులైన యోధులకు నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవాలను జరపడానికి పలు కారణాలున్నాయని వివరించారు అమిత్ షా. నాటి పోరాట యోధుల్ని ప్రస్తుత తరానికి గుర్తు చేయడం, పోరాట యోధుల్ని సన్మానించడం కోసమే అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇవాళ ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవాదివస్‌ జరుపుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా G20 సమ్మిట్‌ గురించీ ప్రస్తావించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ సదస్సు విజయవంతంగా ముగిసిందని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ చరిత్రను దాదాపు 75 ఏళ్ల పాటు కొందరు వక్రీకరించారని, మోదీ ప్రధాని అయ్యాక ఆ తప్పుల్ని సరిచేశారని వెల్లడించారు అమిత్ షా. ఈ 9 ఏళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. సర్దార్ పటేల్, కేఎం మున్షీ కారణంగానే తెలంగాణలో నిజాం పాలన అంతమైందని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థాన్ విమోచన ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి తెలియకుండా గత ప్రభుత్వాలు కుట్ర చేశాయని మండి పడ్డారు. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన ఈ పోరాటం..సమైక్యతా దిన ఎలా అవుతుందని పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ సర్కార్ ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. దీన్ని ఉద్దేశించే అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు.  ఓటు బ్యాంకు కోసమే విమోచన దినోత్సవాన్ని రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. 

"బ్రిటీష్‌ నుంచి భారత్‌కి స్వాతంత్య్రం వచ్చినా నిజాంలు తెలంగాణను 399 రోజుల పాటు పాలించారు. అన్నిరోజులు ఇక్కడి ప్రజలు నరకం చూశారు. సర్దార్ పటేల్‌ రంగంలోకి దిగి 400వ రోజు వాళ్లకు నిజాం కర్కశ పాలన నుంచి విముక్తినిచ్చారు. విమోచన దినోత్సవం జరపాలంటే కొందరు భయపడుతున్నారు"

- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి 

Published at : 18 Sep 2023 09:52 AM (IST) Tags: Modi News Prime Minister Modi Modi telangana tour Telangana News PM Telangana Visit

ఇవి కూడా చూడండి

Mynampally Hanumanth Rao Resign: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

Mynampally Hanumanth Rao Resign: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

Telangana Rain: మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు, 16 జిల్లాల్లో అలర్ట్ - వెల్లడించిన వాతావరణ శాఖ

Telangana Rain: మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు, 16 జిల్లాల్లో అలర్ట్ - వెల్లడించిన వాతావరణ శాఖ

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

IT Tower In Suryapet: సూర్యాపేటలో ఐటీ టవర్, అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

IT Tower In Suryapet: సూర్యాపేటలో ఐటీ టవర్, అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

Telangana News: 9999 నెంబర్ కు యమా క్రేజ్ - ఆర్టీఏకు అనేక లాభాలు తెచ్చిపెడుతున్న ఫ్యాన్సీ నెంబర్లు

Telangana News: 9999 నెంబర్ కు యమా క్రేజ్ - ఆర్టీఏకు అనేక లాభాలు తెచ్చిపెడుతున్న ఫ్యాన్సీ నెంబర్లు

టాప్ స్టోరీస్

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?