అన్వేషించండి

పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రస్తావన- కాంగ్రెస్‌పై మోదీ సెటైర్లు

75 ఏళ్లుగా దేశానికి సేవలు అందిస్తున్న పార్లమెంట్ భవనం గురించి మాట్లాడిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ కీలక ప్రసంగం చేశారు.

75 ఏళ్లుగా దేశానికి సేవలు అందిస్తున్న పార్లమెంట్ భవనం గురించి మాట్లాడిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ విభజన నాటి పరిస్థితులు వివరించారు. అంతక ముందు చాలా రాష్ట్రాల విభజన జరిగిందని వివరించారు. అలా జరిగిన టైంలో రెండు రాష్ట్రాల్లోని ప్రజలంతా హ్యాపీగా సంబరాలు చేసుకున్నారని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన టైంలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించలేదని చెప్పుకొచ్చారు. 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. పాత పార్లమెంట్ బిల్డింగ్ కథ నేటితో ముగిసిపోయింది. రేపట్నుంచి కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లో కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అయితే పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ సోమవారం లోక్ సభలో మాట్లాడుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రస్తావించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పాటు సైతం ఇదే పార్లమెంట్ భవనంలో జరిగిందన్నారు. అయితే గతంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఏర్పాటులా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. వాజ్ పేయి హయాంలో ఆ మూడు రాష్ట్రాలను ఓ ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేయగా, ఆ రాష్ట్రాల్లోనూ ప్రజలు సంబరాలు చేసుకున్నారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్ హయాంలో జరిగినా, ప్రక్రియ మాత్రం సరిగా జరగలేదన్నారు. ఈ విభజనతో ఏపీ, తెలంగాణగా తెలుగు రాష్ట్రాలు మారిపోయినా.. రెండు ప్రాంతాల్లోనూ సంబరాలు జరగలేదన్నారు. రెండు చోట్ల అసంతృప్తి మిగిలిందని, తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందంటూ మోదీ సంచనలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎన్నో బలిదానాలు జరగడంతో పాటు రక్తపుటేర్లు పారాయన్నారు. అందువల్లే కొత్త రాష్ట్రం ఏర్పడినా తెలంగాణలో సంబరాలు చేసుకోలేకపోయారని మోదీ వ్యాఖ్యానించారు. 

తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగం ఎందరికో స్ఫూర్తినిస్తుందన్నారు. మాజీ ప్రధానుల సేవల్ని పేరుపేరునా కొనియాడారు. జీఎస్‌టీ, ఒకే దేశం - ఒకే పింఛను, జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దు లాంటి బిల్లుపై మోదీ మాట్లాడారు. ఎన్నో సేవలు అందించిన పార్లమెంట్ బిల్డింగ్ లో నేడు చివరిసారి సమావేశం అవుతున్నాం అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget