Top Headlines Today: రుషికొండపై కట్టడం సెక్రటేరియట్ కాదన్న వైసీపీ! తెలంగాణ బీజేపికి షాక్, మాజీ మంత్రి రాజీనామా
Top 5 Telugu Headlines Today 13 August 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

ఆ భూములు నావేనని తేల్చితే అందరికీ ఎకరం చొప్పున పంచేస్తా - మంత్రి గుడివాడ
ఒక ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులతో రుషికొండపై నిర్మాణాలు చేస్తుంటే విపక్షాలకు కలుగుతున్న అభ్యంతరాలు ఏంటని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు. ప్రస్తుతం చేస్తున్న నిర్మాణాలకు సమీపంలోనే రామానాయుడు స్టూడియో, టీటీడీ దేవాలయం, వెల్ నెస్ సెంటర్ ఉన్నాయని, అవన్నీ కొండపైనే నిర్మించారని అన్నారు. విశాఖపట్నం రాజధాని అవుతున్నందున అక్కడ భూముల లభ్యత తక్కువగా ఉందని, అందుకే కొండలపై నిర్మాణాలు చేయడం అక్కడ సహజమేనని అన్నారు. గతంలో కూడా రుషికొండపై నిర్మాణాలు చేపట్టారని మంత్రి గుర్తు చేశారు. విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్‌లో మంత్రి గుడివాడ అమర్ నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు
స్పోర్ట్స్ స్కూల్‌లో అధికారి లీలలపై ఎమ్మెల్సీ ఆగ్రహం, సస్పెండ్ చేస్తామని క్రీడా మంత్రి వెల్లడి
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో అధికారి లైంగిక వేధింపుల ఘటనపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్ చేస్తామని చెప్పారు. అధికారి లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మహిళలపై వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పూర్తి వివరాలు
రుషికొండపై కట్టడం సెక్రటేరియట్ కాదు - వైసీపీ మరో ట్వీట్, మానవ తప్పిదమని వెల్లడి
రుషికొండపై చేపడుతున్న నిర్మాణం సెక్రటేరియట్ కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడ నిర్మిస్తున్నది సచివాలయం అని శనివారం (ఆగస్టు 13) వైఎస్ఆర్ సీపీ అధికారిక ట్విటర్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ట్వీట్‌పై విమర్శలు రావడంతో తాజాగా ఆదివారం ఉదయం వెనక్కి తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణనలోకి తీసుకోగలరు’’ అని వైసీపీ పేర్కొంది. తర్వాత కాసేపటికే ట్వీట్ ను డిలీట్ చేశారు. పూర్తి వివరాలు
పుంగనూరు ఘటనలో ఇదేం విచిత్రమో! అమెరికాలోని టీడీపీ నేతపై కేసు - వీడియో వైరల్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సాగునీరు ప్రాజెక్టులపై యుధ్దభేరి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 4వ తారీఖున అంగళ్లు, పుంగనూరు పర్యటన నేపథ్యంలో జరిగిన అల్లర్ల విషయంపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అయితే ఈ అల్లర్లకు కారకులుగా ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పాటుగా, పార్టీలోని ముఖ్య నేతలపై, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే కొంత మంది టీడీపీ నాయకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. కానీ ఈ కేసులో అమెరికాలో ఉన్న ఓ టీడీపీ నేతపై పోలీసులు ఏఫ్ఐఆర్ నమోదు చేయడంపై బాధిత టీడీపీ నాయకుడు విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు
తెలంగాణ బీజేపికి షాక్, రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి
తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత కిద్ది రోజులుగా జోరుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెబుతూ రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించారు. ఈ సందర్భగా ఆయన బీజేపీ, అధికార బీఆర్‌ఎస్ పార్టీలపై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. బీజేపీలో చేరి నేతలు మోసపోతున్నారని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు పోటీ అని భావించి అనేకమంది ఉద్యమకారులు బీజేపీలో చేరి భంగపాటుకు గురవుతున్నారని విమర్శలు చేశారు. పూర్తి వివరాలు
పైనల్‌గా కమ్యూనిస్టులకు గుడ్ న్యూస్ - సీట్లు కేటాయించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారా ?
తెలంగాణ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయాలని ఫైనల్‌గా నిర్ణయించుకున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కమ్యూనిస్టులతో కమ్యూనికేషన్ ను కేసీఆర్ నిలిపివేశారు. ఈ అంశంపై కమ్యూనిస్టుపార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. అయితే మళ్లీ కేసీఆర్ మనసు మార్చుకున్నారని.. కమ్యూనిస్టులతో పొత్తులకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. పూర్తి వివరాలు





















