News
News
X

TS News Developments Today: నేడు రాజ్యాంగ దినోత్సవం- తెలంగాణ ‌టుడే అజెండాలో ముఖ్యాంశాలు ఇవే!

TS News Developments Today: డిచ్ పల్లిలోని తెలంగాణా యూనివర్సిటీకి ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత రానున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా "ఎ డైలాగ్ విత్ స్టూడెంట్స్"  కార్యక్రమంలో పాల్గొంటారు.

FOLLOW US: 
Share:

నేడు భద్రాద్రి జిల్లా దిశ కమిటీ సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దిశ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే పథకాల అమలు తీరుపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు, మహాబూబాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు మాలోత్‌ కవిత ఈ సమావేశానికి హాజరవుతారు. కొత్తగూడెం క్లబ్‌లో జరిగే ఈ సమావేశానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రజాప్రతినిధులతోపాటు దిశ కమిటీ సభ్యులు, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల అమలు, జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

శబరిమలకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు 

అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం డిసెంబరు(DEC), జనవరి(JAN) నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్‌-కొల్లాంకు డిసెంబర్‌ 5, 12, 19, 26, జనవరి 2, 9, 16 తేదీల్లో... కొల్లాం-హైదరాబాద్‌కు డిసెంబర్‌ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17.. నర్సాపూర్‌-కొట్టాయం డిసెంబర్‌ 2, 9, 16, 30, జనవరి 6, 13.. కొట్టాయం-నర్సాపూర్‌ డిసెంబర్‌ 3, 10, 17, 24, జనవరి 7, 14.. సికింద్రాబాద్‌-కొట్టాయం డిసెంబర్‌ 4, 11, 18, 25, జనవరి 1, 8.. కొట్టాయం-సికింద్రాబాద్‌ డిసెంబర్‌ 4, 11, 18, 25, జనవరి 2, 9 తేదీల్లో రైళ్లు బయలుదేరుతాయి.

నేడు రాజ్యాంగ దినోత్సవం. తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు. 

1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడినా... రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రాజ్యాంగం గొప్పదనాన్ని తెలిపే ప్రసంగాలు, ఉపన్యాసాలు, వ్యాసరచన లాంటి కార్యక్రమాలను ప్రభుత్వాఫీసుల్లో నిర్వహించాలని సూచించారు. అలా 2015 నుంచి ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకొంటున్నాం. రాజ్యాంగ దినోత్సవాన్ని "సంవిధాన్ దివస్" అని కూడా పిలుస్తూ ఉంటారు.

తెలంగాణ యూనివర్శటీకి ఎమ్మెల్సీ కవిత. 

డిచ్ పల్లి లోని తెలంగాణా యూనివర్సిటీకి ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత ఇవాళ రానున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉదయం 11 గంటలకు జరిగే "ఎ డైలాగ్ విత్ స్టూడెంట్స్"  కార్యక్రమంలో కవిత పాల్గొంటారు.

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త

దశాబ్దాల నుంచి అంగన్‌వాడీలుగా పనిచేస్తున్నవారిని రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్‌-2 సూపర్‌వైజర్లుగా నియమించనున్నది. అర్హులైనవారికి ఈరోజు పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు సమాచారం. 433 గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టులను అంగన్‌వాడీ టీచర్లతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించడంతో అర్హులకు జనవరి 2నే రాతపరీక్ష నిర్వహించి, అప్పుడే మెరిట్‌ లిస్ట్‌ను రూపొందించారు.

జిల్లాలవారీగా సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తవడంతో తమకు అన్యాయం జరుగుతున్నదంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో రాత పరీక్ష మొదలుకొని సర్టిఫికెట్ల పరిశీలన వరకు అంతా సక్రమంగానే జరిగిందని కోర్టు తీర్పు ఇచ్చింది. తదనుగుణంగా వెంటనే నియామక ప్రక్రియను చేపట్టేందుకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కసరత్తు పూర్తిచేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను శుక్రవారం రాత్రి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి, శనివారం పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్‌లో నీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో  ఈరోజు (నవంబర్ 26న) ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. శివాజీ చౌక్, బాలాపూర్ వద్ద నీటి సరఫరా లీకేజీని పరిష్కరించే పని కారణంగా నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. అయితే, హఫీజ్ బాబానగర్ లో 100 అడుగుల రోడ్డు విస్తరణ ప్రాజెక్టు అలైన్ మెంట్ లో భాగంగా ఎయిర్ వాల్వ్ లను మార్చడం మరో కారణం. బాలాపూర్‌, మైసారం, బార్కాస్‌, అల్మాస్‌గూడ, లెనిన్‌ నగర్‌, బడంగ్‌పేట్‌, ఏఆర్‌సీఐ, మీరాలం, భోజగుట్ట, బుద్వేల్‌, శంషాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోనుంది.ఈప్రాంతాల్లోని నివాసం ఉండే ప్రజలు అసౌకర్యాన్ని నివారించడానికి నీటిని పొదుపుగా ఉపయోగించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB)కోరింది.

రాష్ట్రంలో గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- 4 పోస్టుల భర్తీకి సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుమతి

ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వార్డు ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో అత్యధికంగా 6,859 జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా రెవెన్యూ శాఖలో 2,077, పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖలో 1,245 పోస్టులు ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 44, యానిమల్ హస్బెండరీలో 2, బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 307, సివిల్ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 72, ఎనర్జీలో 2, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 23 పోస్టులు ఉన్నాయి.

ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 46, జీఏడీలో 5, హెల్త్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 338, హయ్యర్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 742, హోం శాఖలో 133, ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 51, లేబర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 128, మైనార్టీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 191, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 601, ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2, ఎస్సీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 474, సెకండరీ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 97, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 20, ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 221, విమెన్ అండ్ చిల్డ్రన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 18, యూత్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 13 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి.

మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వార్డు ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు 1,862, ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 429 జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు, 18 జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు ఉన్నాయి. వీటిని తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 

వైయస్సార్ టిపి అధినేత్రిషర్మిల  ప్రజా ప్రస్థానం పాదయాత్ర 

వైస్ షర్మిల పాదయాత్ర మూలుగు జిల్లాలో కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పుతు ముందుకు సాగుతున్నారు.

Published at : 26 Nov 2022 08:10 AM (IST) Tags: Telugu News Today Telangana LAtest News TS News Developments Today Telangana Headlines Today

సంబంధిత కథనాలు

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,  ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 9 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!

TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 9 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!

నేను చేసింది నమ్మకద్రోహం అయితే నువ్వు చేసిందేంటీ? అనిల్‌ను ప్రశ్నించిన కోటంరెడ్డి

నేను చేసింది నమ్మకద్రోహం అయితే నువ్వు చేసిందేంటీ? అనిల్‌ను ప్రశ్నించిన కోటంరెడ్డి

Telangana budget 2023 : ఎన్నికల ఏడాదిలో కలర్ ఫుల్ బడ్జెట్ - బడ్జెట్‌లో కొత్త పథకాలు పెట్టనున్న తెలంగాణ సర్కార్ !

Telangana budget 2023 : ఎన్నికల ఏడాదిలో కలర్ ఫుల్ బడ్జెట్ - బడ్జెట్‌లో కొత్త పథకాలు పెట్టనున్న తెలంగాణ సర్కార్ !

టాప్ స్టోరీస్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!