News
News
X

TS News Developments Today: నేడు బీజేపీలోకి కాంగ్రెస్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి, జేపీ నడ్డా సమక్షంలో

హైదారాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు GHMC మరో ఫ్లై ఓవర్ బ్రిడ్జి సిద్ధం చేసింది. శిల్పా లే ఔట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని మంత్రి కేటిఆర్ ఈరోజు ప్రారంభించనున్నారు.

FOLLOW US: 
 

హైదరాబాద్ లో నేడు మరో ఫ్లై ఓవర్ ప్రారంభిచనున్న మంత్రి కేటీఆర్

నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రాబోతుంది.  శిల్పా లే ఔట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర మునిసిపల్ పట్టణాభివృద్ధి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈరోజు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తున్నది. ప్రజల అవసరాలను ముందుగా అంచనా వేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ముఖ్యంగా రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగు పరిచి వాహనదారులు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి సకాలంలో చేరడం కోసం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) ప్రోగ్రామ్ ద్వారా చేపట్టిన పలు పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి రావడం మూలంగా ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నాయి. ఐటీ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్ లో గచ్చిబౌలి, మాదాపూర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత రవాణా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా కారిడార్లు, గ్రేడ్ సెపరేట్, అండర్ పాస్‌లు, ఆర్ఓబిలు లాంటి రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

నేడు ఖమ్మంలో మంత్రుల పర్యటన

ఖమ్మం జిల్లాలో రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలు పర్యటించనున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రైతులు పండించిన పంటను దాచుకునేందుకు వీలుగా రఘునాధపాలెం మండలంలో నిర్మించిన వేర్‌హౌజ్‌ గోడౌన్‌లను మంత్రులు ప్రారంబించనున్నారు. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వం కొనుగోలు చేసిన దాన్యం లేదా బియ్యం నిల్వ చేసుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో గోడౌన్‌ల నిర్మాణం జరిగింది. అయితే తొలిసారిగా రైతులు తమ పంటను దాచుకునేందుకు వీలుగా ఈ గోడౌన్‌లను నిర్మించారు.
రఘునాథపాలెం మండలం జింకలతండాలో ఈ  ఈ వేర్‌హౌజింగ్‌ కార్పొరేషన్ ను 14.90కోట్లతో నిర్మించారు. గోదాముల సామర్థ్యం 20వేల మెట్రిక్‌టన్నులు. మంత్రులు ఉదయం 11గంటలకు జింకలతండాలో గోదాముల ప్రారంభించిన అనంతరం అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. 

News Reels

తెలంగాణ రాష్ట్రంలో పోడు సర్వే కు బ్రేక్ 

రాష్ట్రంలో పోడు భూముల సర్వే, హక్కు పత్రాల జారీ అంశం ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. పోడు సాగుదారులు, అటవీ శాఖల మధ్య ఏర్పడుతున్న సరిహద్దుల పంచాయితీ హద్దులు మీరి దాడుల వరకు వెళుతోంది. దీంతో పోడు హక్కు పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2005 డిసెంబరు 13కు ముందు నుంచి సాగు చేసుకుంటున్న వారందరికీ ప్రభుత్వం హక్కు పత్రాలు ఇస్తామని తెలిపింది.ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యతో ఫారెస్ట్ అధికారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనితో పొడు సర్వే  నిలిచిపోయింది.

నేడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి

ఇటీవల కాంగ్రెస్ రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఈరోజు బీజేపీలో చేరనున్నారు. జాతీయ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసిన శశిధర్‌ రెడ్డి బీజేపీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించిన తరువాత రెండు రోజులకు ఆయన ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పర్యటన

ఈరోజు ఉదయం 11 గంటలకు వరంగల్  రంగంపేటలో నూతన నిర్మిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ భరోసా కేంద్రం భవన నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  శంకుస్థాపన  చేస్తారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా తొర్రురు లో పలు అభివృద్ధి పనులలను శంకుస్థాపన, ప్రారంభోత్సవలు చేయనున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతున్న వై ఎస్ ఆర్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైఎస్ ఆర్ టిపి అధినేత్రి షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు షర్మిల.ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కనీసం ఊరికో ఉద్యోగం ఇవ్వలేదు. దళిత బంధు పేరుతో దగ్గరి అనుచరులకు దోచి పెడుతున్నారని' ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏదో ఒక కొత్త పథకం తీసుకురావటం కేసీఆర్ కు అలవాటుగా మారిందని  రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదుకదా.. తాగుబోతుల తెలంగాణ మార్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోసారి గ్రానైట్ కంపెనీల్లో తనిఖీలు తప్పవా?

కరీంనగర్ జిల్లాలో విస్తరించి ఉన్న గ్రానైట్ కంపెనీల్లో మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేస్తాయని ప్రచారం కొనసాగుతోంది .. అనుమతులు తీసుకున్నవే పదుల సంఖ్యలో ఉండగా అనుమతులు లేని కంపెనీలు సైతం నడుస్తూ ఉన్నట్టుగా అధికారుల దృష్టికి వచ్చింది. అయితే పక్కాగా ఆధారాలు లభించిన వాటిపైనే ఇప్పటివరకు దృష్టిస్తారించిన దర్యాప్తు అధికారులు మిగతా కంపెనీల ద్వారా ఏ మేరకు అక్రమ రవాణా నడుస్తోంది? అనే విషయంపై కూడా దృష్టి సారించే అవకాశం లేకపోలేదు. దీంతో ఈమధ్యే కోట్ల పెట్టుబడి పెట్టి ఈ బిజినెస్ లోకి దిగిన వారికి టెన్షన్ మొదలైంది. పక్కా ఆధారాలు లభిస్తేనే దర్యాప్తు సంస్థలు వాటిపై దృష్టి సారిస్తాయి. అలాంటిది మొన్ననే జరిగిన తనిఖీల్లో మరింత అదనపు సంవత్సరం కూడా లభించినట్లు తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మరోసారి దర్యాప్తు సంస్థలు కరీంనగర్ ని జల్లెడ పట్టే అవకాశం ఉంది.

Published at : 25 Nov 2022 08:26 AM (IST) Tags: Telugu News Today Telangana LAtest News TS News Developments Today Telangana Headlines Today

సంబంధిత కథనాలు

Bandi Sanjay :  తప్పు చేయకపోతే 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ సూటి ప్రశ్న!

Bandi Sanjay : తప్పు చేయకపోతే 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ సూటి ప్రశ్న!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

టాప్ స్టోరీస్

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !

గర్భం దాల్చేందుకు పల్లెటూరికి విదేశీ యువతులు క్యూ! మగాళ్లకు డబ్బులిచ్చి మరీ గర్బధారణ !